Share News

Vasundhara Oswal: ఉగాండాలో భారతీయ బిలియనీర్ కుమార్తె అరెస్ట్.. ఐరాసకు చేరుకున్న కేసు

ABN , Publish Date - Oct 20 , 2024 | 09:38 AM

భారత బిలియనీర్లలో ఒకరైన పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్ ఆర్థిక, నేర కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఉగాండాలో అరెస్టయ్యారు. దీంతో అసలు వసుంధర ఓస్వాల్ ఎవరు అనే ప్రశ్నలు జనాల మదిలో మొదలయ్యాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Vasundhara Oswal: ఉగాండాలో భారతీయ బిలియనీర్ కుమార్తె అరెస్ట్.. ఐరాసకు చేరుకున్న కేసు
Vasundhara Oswal

భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త పంకజ్ ఓస్వాల్(Pankaj Oswal) కుమార్తె వసుంధర ఓస్వాల్ (26)(Vasundhara Oswal) ఉగాండా(uganda)లో అక్రమంగా అరెస్టయ్యారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అక్టోబర్ 1 నుంచి ఉగాండా పోలీసుల కస్టడీలో ఆమె ఉన్నారు. దీంతో పంకజ్ ఓస్వాల్ తన కుమార్తె నిర్బంధానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో అప్పీల్ దాఖలు చేశారు. ఉగాండా అధ్యక్షుడికి ఓ లేఖ రాశారు. అందులో వసుంధరకు ప్రాథమిక హక్కులు, న్యాయపరమైన ప్రాతినిధ్యం, ఆమె కుటుంబంతో సంబంధాలు నిరాకరించబడుతున్నాయని పేర్కొన్నారు. వసుంధర ఓస్వాల్ ఉగాండాలోని ఓస్వాల్ గ్రూప్ ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ENA) ప్లాంట్‌ను సందర్శిస్తున్న క్రమంలో అరెస్టయ్యారు.


విచారణ

ఆ సమయంలో వారెంట్ లేదా గుర్తింపు కార్డు లేనప్పటికీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా నటిస్తున్న సాయుధ వ్యక్తులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిర్బంధ సమయంలో కంపెనీ లాయర్ రీటా నాగబయార్‌తో సహా వసుంధర సహచరులు కూడా అరెస్టయ్యారు. వసుంధరపై నేరారోపణలు, ఆర్థికపరమైన నేరాలు సహా పలు ఆరోపణల కింద అదుపులోకి తీసుకున్నారు. పంకజ్ ఓస్వాల్ యునైటెడ్ నేషన్స్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఆర్బిట్రరీ డిటెన్షన్ (WGAD)కి అప్పీల్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఆలస్యం చేయకుండా వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.


అసలు వసుంధర ఓస్వాల్ ఎవరు?

వసుంధర ఓస్వాల్ భారతీయ బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె. 1999లో జన్మించిన వసుంధర బాల్యం భారతదేశంలోనే కాకుండా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లలో గడిచింది. వసుంధర స్విస్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్‌లో ఆనర్స్ పట్టభద్రురాలైంది. దీంతో పాటు వసుంధర ఓస్వాల్ ప్రో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఓస్వాల్ గ్రూప్ గ్లోబల్ బిజినెస్‌లో భాగంగా ఉంది. దీంతోపాటు ఆమె PRO ఇండస్ట్రీస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె తండ్రి పంకజ్ ఓస్వాల్ భారతదేశంలో కూడా వారి వ్యాపారాన్ని విస్తరించారు.


వసుంధర తల్లి విజ్ఞప్తి

వసుంధర తల్లి రాధిక ఓస్వాల్ తన కుమార్తెతో మాట్లాడేందుకు అనుమతించాలని ఉగాండా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తన చిన్న కుమార్తెకు విదేశాలలో జైలు శిక్ష విధించబడిందని ఆమె అన్నారు. మానవ హక్కుల న్యాయవాది చెర్రీ బ్లెయిర్ వసుంధర కేసును స్వీకరించారు. వసుంధర "ఇంటికి దూరంగా" బాధాకరమైన అనుభవాన్ని అనుభవిస్తోందని బ్లెయిర్ తెలిపారు. ఈ క్రమంలో ఆమెకు శాఖాహారం లేకపోవడం, నోటీసు లేకుండా అరెస్టు చేయడం, అపరిశుభ్రమైన పరిస్థితులను ఎదుర్కోవడం వంటి అమానవీయ పరిస్థితుల గురించి కూడా ఆమె కుటుంబ న్యాయ బృందం ఆందోళన వ్యక్తం చేసింది.


ఖరీదైన ఆస్తి కొనుగోలు

పంకజ్ ఓస్వాల్, రాధిక ఓస్వాల్ ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఈ ఆస్తి స్విట్జర్లాండ్‌లోని గిన్జిన్స్‌లో ఉంది. ఇది గతంలో గ్రీకు షిప్పింగ్ మాగ్నెట్ అరిస్టాటిల్ ఒనాసిస్ కుమార్తె క్రిస్టినా ఒనాసిస్ ఆస్తి. 200 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1,649 కోట్లు)కు కొనుగోలు చేశారు. వసుంధర ఓస్వాల్ అరెస్ట్ కేసు కుటుంబంలోనే కాకుండా మానవ హక్కులు, విదేశీ సంబంధాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని ఉగాండా మీడియా నివేదికలు చెఫ్‌ని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో వసుంధర ఓస్వాల్‌ను అరెస్టు చేసినట్లు చెబుతున్నాయి. అయితే మరికొన్ని మాత్రం ఆమె మోసం, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో ప్రమేయం ఉందని ఆరోపించాయి.


ఇవి కూడా చదవండి:

Missed Call: మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ మిస్డ్ కాల్ ఇచ్చి ఇలా చెక్ చేసుకోండి..


Personal Finance: మహిళలకు గుడ్ న్యూస్.. రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..


Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..


Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్‌‌కు భారీ షాక్.. 11 నెలల కనిష్టానికి షేర్లు


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 20 , 2024 | 09:39 AM