Cyber criminals: లింక్ పంపి రూ.1.45 లక్షలు దోచేశారుగా..
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:29 PM
ఫుడ్ ఆర్డర్ చేసి, క్యాన్సిల్ చేసిన మహిళను సంప్రదించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals), ఏపీకే లింక్‌ను పంపి రూ.1.45 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన గృహిణి(38) జెప్టో యాప్‌లో ఆహార పదార్థాలు ఆర్డర్ పెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసింది.
హైదరాబాద్ సిటీ: ఫుడ్ ఆర్డర్ చేసి, క్యాన్సిల్ చేసిన మహిళను సంప్రదించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals), ఏపీకే లింక్‌ను పంపి రూ.1.45 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన గృహిణి(38) జెప్టో యాప్‌లో ఆహార పదార్థాలు ఆర్డర్ పెట్టింది. కొద్దిసేపటి తర్వాత ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసింది. వెంటనే ఆమెను సంప్రదించిన సైబర్ నేరగాడు జెప్టో సంస్థ ప్రతినిధిని అని చెప్పుకున్నాడు. మీరు క్యాన్సిల్ చేసిన ఆర్డర్ డబ్బు మీ ఖాతాలో జమకాకుంటే ఏమి చేయాలో వీడియో కాల్‌లో చెబుతూ స్ర్కీన్ షేరింగ్ చేయాలని సూచించాడు.
ఈ వార్తను కూడా చదవండి: Harish Rao: మూసీ మురికికూపానికి కారణం మీరు కాదా..
అంతేకాకుండా లింక్‌ను పంపి అందులో వివరాలు నమోదు చేయాలని చెప్పాడు. లింక్‌ను తెరిచి ఆమె వివరాలు నమోదు చేసిన తర్వాత బ్యాంకు వివరాలు నమోదు చేయాలని కోరాడు. ఆమెకు అనుమానం వచ్చినా ఓటీపీ రాకుండా డబ్బు ఎక్కడికీ పోదు అన్న ధీమాతో క్రెడిట్ కార్డు(Credit card) వివరాలు నమోదు చేసింది.
అయినా అనుమానంతో బ్యాంకు అధికారులను సంప్రదించి కార్డును బ్లాక్ చేయాలని సూచించింది. కానీ సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ద్వారా మొబైల్(Mobile)ను హ్యాక్ చేసి, ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న సమయంలోనే క్రెడిట్ కార్డు నుంచి రూ. 1.45 లక్షలు వేరే ఖాతాకు బదిలీ చేశారు. దాంతో బాధితురాలు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు పిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ నుంచి నగరానికి హెరాయిన్.. ఐటీ కారిడార్‌లో విక్రయం
ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!
Read Latest Telangana News and National News