Hyderabad: హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు రౌడీషీటర్ల అరెస్టు
ABN , Publish Date - Jun 02 , 2024 | 10:58 AM
దారి దోపిడీలు, హత్యలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఐదుగురు రౌడీషీటర్లను సిటీ సౌత్‌ఈస్టు, సౌత్‌వెస్టు టాస్క్‌ఫోర్స్(City South East and South West Task Force) పోలీసులు అరెస్టుచేశారు.
హైదరాబాద్ సిటీ: దారి దోపిడీలు, హత్యలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఐదుగురు రౌడీషీటర్లను సిటీ సౌత్‌ఈస్టు, సౌత్‌వెస్టు టాస్క్‌ఫోర్స్(City South East and South West Task Force) పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి దేశవాళీ తుపాకీ, 5 రౌండ్ల బుల్లెట్లు, 4 పెద్ద కత్తులు, రెండు ఇనుపరాడ్లు, యాక్టివా వాహనం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మి పెరుమాళ్ వివరాలు వెల్లడించారు. కిస్మత్‌పూర్‌కు చెందిన షేక్ ఇర్ఫాన్ డ్రైవర్. ఇతడిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station)లో రౌడీషీట్ ఉంది. భౌతిక దాడులు, హత్యలు, దారిదోపిడీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు. ఇతడిపై ట్రై కమిషనరేట్ పరిధిలో 34 కేసులున్నాయి. లంగర్‌హౌజ్‌కు చెందిన రౌడీషీటర్ షేక్ ఇస్మాయిల్‌తో ఇర్ఫాన్‌కు శత్రుత్వం ఉంది. అతడ్ని అంతమొందించాలని పథకం వేశాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాకే.. తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లు ఉంది
ఈ విషయం స్నేహితులైన కాళీమందిర్‌కు చెందిన మహ్మద్ ఆరిఫ్, మాదన్నపేటకు చెందిన రౌడీషీటర్ మహ్మద్ అక్బర్ పాషా, మీర్‌చౌక్‌కు చెందిన రౌడీషీటర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ క్విజార్ యాకుబికి చెప్పాడు. దేశవాళీ తుపాకీ, 5 రౌండ్ల బుల్లెట్స్‌ను నాందేడ్‌లో రూ. 20 వేలకు కొనుగోలు చేశారు. ఇర్ఫాన్ గ్యాంగ్‌పై నిఘాపెట్టిన సౌత్‌ఈస్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం నలుగురిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ఇర్ఫాన్ ప్రత్యర్థి షేక్ ఇస్మాయిల్ ఆదిల్ ఈ ఏడాది జనవరిలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన అనుచరుల్లో ఒకరైన ముబారక్ సిగర్‌ను హత్య చేశాడు. ఈ కేసులో జైలుకెళ్లిన ఇస్మాయిల్ ఇటీవలే బయటకు వచ్చాడు. మరిన్ని నేరాలు చేయడానికి పెద్ద పెద్ద కత్తులను సిద్దం చేసుకున్నాడు. నిఘా పెట్టిన సౌత్ వెస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద 4 పెద్ద కత్తులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదుగురు ఘరానా నేరస్థులను అరెస్టు చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News