Share News

Hyderabad: అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా అరెస్ట్‌

ABN , Publish Date - Aug 14 , 2024 | 11:31 AM

హైదరాబాద్‌ నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళా అంతర్రారాష్ట్ర ముఠాను సుల్తాన్‌బజార్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్‌ డీసీపీ బాలస్వామి వివరాలను వెల్లడించారు.

Hyderabad: అంతర్రాష్ట్ర మహిళా దొంగల ముఠా అరెస్ట్‌

- దుకాణాల్లోకి వెళ్లి.. యజమానుల దృష్టి మరల్చి.. విలువైన దుస్తులు, వస్తువుల చోరీ

- 100 గంటలపాటు సీసీ టీవీఫుటేజీల పరిశీలన

హైదరాబాద్: హైదరాబాద్‌ నగరంలో వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళా అంతర్రారాష్ట్ర ముఠాను సుల్తాన్‌బజార్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్‌ డీసీపీ బాలస్వామి వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన ఐదుగురు మహిళలతో కూడిన ముఠాను సికిందరాబాద్‌లోని సితారా హోటల్‌లో పట్టుకున్నామన్నారు. ఈ ముఠా గుంపులుగా దుకాణాలలోకి వెళ్లి కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ దుకాణ యజమానుల దృష్టి మరల్చి విలువైన వస్తువులను దొంగిలిస్తుంటారన్నారు. సుల్తాన్‌బజార్‌(Sultanbazar)లోని ఓ షాపింగ్‌ మాల్‌లో ఓ ఎన్నారై మహిళ నుంచి బ్యాగ్‌ లాక్కెళ్లారన్నారు.

ఇదికూడా చదవండి: Commissioner: అపార్ట్‌మెంట్‌లకు ఒకేచోట డస్ట్‌ బిన్‌ ఉండాలి..


బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ ముఠా దొంగిలించిన డబ్బుతో విలువైన దుస్తులు, ఇతర వస్తువులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వారి నుంచి రూ.14వేల విలువ చేసే నకిలీనగలు, దుస్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. 100 గంటలపాటు సీసీటీవీఫుటేజీలను పరిశీలించిన తర్వాత ఈ ముఠాను అరెస్ట్‌ చేయడం సాధ్యమైందన్నారు. నగరంలో పలు చోరీలకు పాల్పడుతున్న మరో ముఠాపై పోలీసులు ఆరా తీస్తున్నారని ఈస్ట్‌జోన్‌ డీసీపీ తెలిపారు.


....................................................................................

ఈ వార్తను కూడా చదవండి:

..................................................................

Commissioner: అపార్ట్‌మెంట్‌లకు ఒకేచోట డస్ట్‌ బిన్‌ ఉండాలి..

- గ్రేటర్‌ కమిషనర్‌ ఆమ్రపాలి

హైదరాబాద్‌ సిటీ: అపార్ట్‌మెంట్‌లో డోర్‌ టు డోర్‌ తిరగకుండా ఒకేచోట డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేస్తే చెత్త సేకరణ సులభతరమవుతుందని, అందుకోసం అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లను సంప్రదించి బిన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనర్‌ ఆమ్రపాలి అడిషనల్‌, జోనల్‌ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అపార్ట్‌మెంట్‌లలో చెత్తసేకరణ వివిధ కారణాలతో పూర్తి స్థాయిలో స్వచ్ఛ ఆటోలకు రావడం లేదని, డస్ట్‌బిన్‌ ఏర్పాటు చేయడం వల్ల చెత్తను స్వచ్ఛ ఆటోలో తీసుకునేందుకు సులభతరమవుతుందని అన్నారు.

city4.jpg


పార్కుల వద్ద పరిశుభ్రంగా ఉండేలా డస్ట్‌బిన్లు ఉండాలన్నారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల(Power transformers) వద్ద చెత్త వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, ఫెన్సింగ్‌ లేని ట్రాన్స్‌ఫార్మర్ల వివరాల నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జంక్షన్ల వద్ద వాహనదారులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా పూల మొక్కలు ఏర్పాటు చేయాలని యూబీడీ అధికారులకు సూచించారు. పశువులు రోడ్లపై సంచరించకుండా క్షేత్రస్థాయి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2024 | 11:31 AM