Share News

Hyderabad: అంతర్రాష్ట్ర ఘరానా దొంగ అరెస్ట్‌

ABN , Publish Date - May 29 , 2024 | 12:34 PM

సనత్‌నగర్‌ డివిజన్‌ లింగయ్యనగర్‌లో జరిగిన చోరీ కేసును 4 రోజుల వ్యవధిలోనే ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు(SR Nagar Police) ఛేదించా రు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్‌ చేశారు.

Hyderabad: అంతర్రాష్ట్ర ఘరానా దొంగ అరెస్ట్‌

- రూ. 2 లక్షల విలువ చేసే నగలు, కొంత నగదు స్వాధీనం

హైదరాబాద్: సనత్‌నగర్‌ డివిజన్‌ లింగయ్యనగర్‌లో జరిగిన చోరీ కేసును 4 రోజుల వ్యవధిలోనే ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు(SR Nagar Police) ఛేదించా రు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ.2లక్షల విలువచేసే నగలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో కేసు వివరాలను ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాధ్‌రెడ్డి, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ జానకీరాములు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్రం తాడిపత్రి సమీపంలోని శ్రీరాములు పేటకు చెందిన వాయులువారి బాలగోవిందు (22) ఉదయం చిత్తుకాగితాలు ఏరుకునేవాడిలా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. రాత్రిపూట ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీ చేస్తాడు. గతేడాది తాడిపత్రి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు చోట్ల చోరీలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ చేశాడు. అక్కడి నుంచి రెండు నెలల క్రితం నగరానికి వచ్చి దాసారం గుడిసెల్లో నివాసం ఉంటున్నాడు.

ఇదికూడా చదవండి: ప్రేమ, పెళ్లి పేరుతో పలువురికి వల.. సైబర్‌ మోసగాడి అరెస్ట్‌


ఈ సంవత్సరం ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. చోరీ చేసిన సొత్తును దాసారం గుడిసెల్లో ఉంటున్న అనంతపురం జిల్లా గాంధీకట్టకు చెందిన పి.సుంకప్ప, సురేందర్‌కు అప్పగిస్తాడు. వీరు చోరీ సొత్తును అమ్మి సొమ్ము చేస్తుంటారు. బంగారం, వెండి నగలను సనత్‌నగర్‌కు చెందిన బంగారం వ్యాపారి అశోక్‌కుమార్‌ జైన్‌ వద్ద కుదువపెట్టారు. ఎస్‌ఆర్‌నగర్‌ స్టేషన్‌ పరిధిలో చోరీలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న క్రైంటీం సభ్యులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలగోవిందుతోపాటు సుంకప్ప, సురేందర్‌ను దాసారం గుడిసెల్లో అరెస్ట్‌ చేశారు. చోరీ సొత్తును తాకట్టు పెట్టుకున్న అశోక్‌కుమార్‌ జైన్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. ఈ నెల 24న లింగయ్యనగర్‌లో నివాసం ఉంటున్న ఎస్‌ఆర్‌నగర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి నాగేష్‌ ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించిన 2 తులాల బంగారం, 750 గ్రాముల వెండి నగలతోపాటు రూ. 2 లక్షలు విలువ చేసే వెండి నగలు, రూ. 2 వేల నగదును స్వాధీనం చేసుకుని నింధితులను రిమాండ్‌కు తరలించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu Newshy

Updated Date - May 29 , 2024 | 12:34 PM