Shiva Puja: శివుడిని ఇలా పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి..!
ABN , Publish Date - Jul 01 , 2024 | 05:46 PM
Shiva Puja: హిందువులు ఆది దేవుడు శివుడిని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. హిందు మత గ్రంధాల ప్రకారం శివయ్యకు అనేక పేర్లు ఉన్నాయి. భోలేనాథ్, ఆదిదేవుడు, బోలాశంకరుడు, గరళకంఠుడు, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. అయితే, ఆ పరమేశ్వరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే శివలింగానికి భక్తులు జలాభిషేకం చేస్తుంటారు.
Shiva Puja: హిందువులు ఆది దేవుడు శివుడిని అనేక రకాల పేర్లతో పిలుస్తారు. హిందు మత గ్రంధాల ప్రకారం శివయ్యకు అనేక పేర్లు ఉన్నాయి. భోలేనాథ్, ఆదిదేవుడు, బోలాశంకరుడు, గరళకంఠుడు, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. అయితే, ఆ పరమేశ్వరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే శివలింగానికి భక్తులు జలాభిషేకం చేస్తుంటారు. ఇలా అభిషేకం చేయడం వలన భక్తుల కోరికలను, సమస్యలను ఆ శివయ్య తొలగిస్తారని విశ్వాసం. అయితే, వేది పండితుల ప్రకారం.. శివయ్యకు జలాభిషేకంతో పాటు.. మరికొన్ని పదార్థాలు నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా వారం ప్రకారం ఆయా పదార్థాలను శివుడికి సమర్పిస్తే మేలు జరుగుతుందంటున్నారు. మరి శివయ్యకు ఏ రోజున ఏం సమర్పిస్తే మంచిది? వేద పండితులు ఏం చెబుతున్నారు? ప్రత్యేక స్టోరీ మీకోసం..
సోమవారం:
సోమవారం నాడు శివుడికి పచ్చి పాలు సమర్పించాలి. పచ్చి పాలను నైవేద్యంగా పెట్టడం వల్ల చంద్రుడు బలపడి శివుడిని ప్రసన్నం చేసుకుంటాడు. తద్వారా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
మంగళవారం:
మంగళవారం నాడు పరమేశ్వరుడికి తేనె సమర్పించాలి. ఇలా చేస్తే వివాహంలో అడ్డంకులను తొలగిపోతాయి. ఇతర దోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. శుభం జరుగుతుంది.
బుధవారం:
బుధవారం నాడు శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలి. బిల్వపత్రం శివుడికి చాలా ప్రీతికరమైనది. శివుడికి మూడు లేదా ఐదు ఆకులతో ఉన్న బిల్వ పత్రాన్ని సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది.
గురువారం:
గురువారం నాడు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి. ఇది శత్రువులను నాశనం చేస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.
శుక్రవారం:
ఈ రోజున శివలింగంపై రోజ్ వాటర్ లేదా గంధపు నీటితో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే శుక్రుడు బలపడుతాడు. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.
శనివారం:
శనివారం శివలింగానికి నల్ల నువ్వులు లేదా నల్ల శనగలను నైవేద్యంగా సమర్పించాలి. దీని వలన శని దేవుడి అశుభ ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది. శని సాడే సతి, ధైయా ఎటువంటి అశుభ ప్రభావాన్ని కలిగి ఉండవు.
ఆదివారం:
ఆదివారం నాడు అక్షతలను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. దీని వల్ల సూర్య గ్రహం బలపడుతుంది. సూర్యుడు జీవితంలో కీర్తిని అందిస్తాడు.
Note: పైన పేర్కొన్న వివరాలు మత గ్రంథాలు, వేద పండితులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.