Share News

JEE Advanced 2024: నేటి నుంచే JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్.. ఎలా అప్లై చేయాలంటే

ABN , Publish Date - Apr 27 , 2024 | 09:30 AM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు)లో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థుల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2024) రిజిస్ట్రేషన్‌ నేటి నుంచి మొదలు కానుంది. JEE కొత్త దరఖాస్తు ఫారమ్ jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

JEE Advanced 2024: నేటి నుంచే JEE అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్.. ఎలా అప్లై చేయాలంటే
JEE Advanced 2024 IIT JEE registration begins today how to apply process

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు)లో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థుల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2024) రిజిస్ట్రేషన్‌ నేటి నుంచి మొదలు కానుంది. JEE కొత్త దరఖాస్తు ఫారమ్ jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అయితే JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష 2024కి టాప్ 2.5 లక్షల JEE మెయిన్ ర్యాంక్ హోల్డర్లు మాత్రమే అర్హులనే విషయం అభ్యర్థులు గమనించాలి.

షెడ్యూల్ ప్రకారం JEE అడ్వాన్స్‌డ్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. మే 7 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా తమకు నచ్చిన ఎనిమిది పరీక్ష నగరాలను ఎంచుకోవాలి.


ఎగ్జామ్ ఎప్పుడు

JEE అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్ష 2024 ద్వారా IITలు ఇంజనీరింగ్, సైన్స్, ఆర్కిటెక్చర్ కోర్సులలో అండర్ గ్రాడ్యుయేట్, ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, బ్యాచిలర్ మాస్టర్ డ్యూయల్ డిగ్రీలలో ప్రవేశాన్ని పొందవచ్చు. మే 26న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 01, పేపర్ 02 ఒక్కొక్కటి మూడు గంటల పాటు నిర్వహిస్తారు. రెండు పేపర్లలో తప్పనిసరిగా హాజరుకావాలి. పేపర్ 01 పరీక్షను ఉదయం 09 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 02 పరీక్షను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. 40% వైకల్యం ఉన్న PWD అభ్యర్థులకు పరీక్షను పూర్తి చేయడానికి ఒక గంట అదనపు సమయం ఇవ్వబడుతుంది.


దరఖాస్తు ఫీజు

ఈ ఏడాది అన్ని కేటగిరీలకు సంబంధించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ఫీజును అధికారులు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు రూ.1600, ఇతర అభ్యర్థులందరూ రూ.3200 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

  • ముందుగా అభ్యర్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

  • ఒక కొత్త విండో తెరుచుకుంటుంది, ఇచ్చిన ఫారమ్‌లో మీ వివరాలను నమోదు చేయండి

  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, మీ అప్లికేషన్‌ను సమర్పించండి

  • తదుపరి అవసరాల కోసం అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్‌ తీసుకుని మీ వద్ద ఉంచుకోండి


ఇది కూడా చదవండి:

BJP: కమలం ఆశల రేకులు హ్యాట్రిక్‌ కొట్టి రికార్డు సాధించడంపై బీజేపీ గురి.. మోదీ ఆకర్షణే బలం..


Delhi: మీకు ప్రజల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయి

Read Latest Education News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 09:35 AM