RRB Recruitment 2024: రైల్వే శాఖలో ఉద్యోగాల జాతర.. పూర్తి వివరాలివే..
ABN , Publish Date - Aug 21 , 2024 | 08:18 AM
RRB Para Medical Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పారా మెడికల్‌లోని వివిధ కేటగిరీలలో 1300 లకు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది.
RRB Para Medical Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పారా మెడికల్‌లోని వివిధ కేటగిరీలలో 1300 లకు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది. అప్లికేషన్స్ ఆగష్టు 17వ తేదీ నుంచే ప్రారంభమవగా.. అప్లికేషన్ లాస్ట్ డేట్ సెప్టెంబర్ 16. నర్సింగ్ సూపరింటెండెంట్, డైటీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ సహా వివిధ విభాగాల్లో పోస్టులను ప్రకటించింది. అయితే, వీటిలో ఎక్కువగా నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 1376 పోస్టులు ఉండగా.. అభ్యర్థులు RRB ప్రాంతీయ వెబ్‌సైట్స్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
RRB Para Medical Recruitment 2024: కీలక తేదీలు
అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: 17 ఆగష్టు 2024
దరఖాస్తుకు చివరి తేదీ: 16 సెప్టెంబర్ 2024
ఎడిట్ ఆప్షన్ : 17 సెప్టెంబర్ నుండి 26 సెప్టెంబర్ 2024 వరకు
పోస్టుల వివరాలివే..
డైటీషియన్: 5 పోస్టులు
నర్సింగ్ సూపరింటెండెంట్: 713 పోస్టులు
ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్: 4 పోస్టులు
క్లినికల్ సైకాలజిస్ట్: 7 పోస్టులు
డెంటల్ హైజీనిస్ట్: 3 పోస్ట్‌లు
డయాలసిస్ టెక్నీషియన్: 20 పోస్టులు
హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్ III: 126 పోస్టులు
లేబొరేటరీ సూపరింటెండెంట్: 27 పోస్టులు
పెర్ఫ్యూషనిస్ట్: 2 పోస్ట్లు
ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ II: 20 పోస్టులు
ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 2 పోస్టులు
క్యాత్ లేబొరేటరీ టెక్నీషియన్: 2 పోస్టులు
ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్): 246 పోస్టులు
రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్: 64 పోస్టులు
స్పీచ్ థెరపిస్ట్: 1 పోస్ట్
కార్డియాక్ టెక్నీషియన్: 4 పోస్టులు
ఆప్టోమెట్రిస్ట్: 4 పోస్టులు
ECG టెక్నీషియన్: 13 పోస్టులు
లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ II: 94 పోస్టులు
ఫీల్డ్ వర్కర్: 19 పోస్టులు
ఎంపిక ప్రక్రియ..
ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇది CBTలో వారి మెరిట్ ఆధారంగా ఉంటుంది. షిఫ్టుల వారీగా ఈ పరీక్ష ఉంటుంది. అంతేకాదు.. నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు అధికారిక RRB వెబ్‌సైట్‌లతో పాటు SMS, ఇమెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.
దరఖాస్తు ఫీజు ఎంత?
అభ్యర్థులందరికీ దరఖాస్తు ఫీజు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, వికలాంగులు, స్త్రీ, ట్రాన్స్‌జెండర్స్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు ఫీజు రూ. 250. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా UPI ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మరింత సమాచారం కోసం అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.