Share News

TG Elections: రేవంత్‌ సమర్థుడు.. బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ధర్మపురి అర్వింద్ సంచలనం

ABN , Publish Date - Apr 14 , 2024 | 04:37 PM

భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ను పొగుడుతూనే, తనదైన శైలిలో విమర్శలు చేశారు.

TG Elections: రేవంత్‌ సమర్థుడు.. బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ధర్మపురి అర్వింద్ సంచలనం
Nizamabad MP Dharmapuri Arvind Welcomes To CM Revanth Reddy

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (BJP) ఫైర్ బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Arvind) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌ను పొగుడుతూనే, తనదైన శైలిలో విమర్శలు చేశారు. ‘రేవంత్ రెడ్డికి ఇంకా రాజకీయ జీవితం ఉంది. ఓ 15 ఏళ్లు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటారు. ఆయన ఉన్న పార్టీకి మాత్రం భవిష్యత్ లేదు. రేవంత్ రెడ్డి సమర్థుడు. కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల అసమర్థుడిలా మారుతున్నాడు. అందుకోసం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నా అని’ అర్వింద్ కోరారు.

TG Politics: తప్పుడు మార్గంలో రాజకీయాలు చేయొద్దు: వెంకట్ రాంరెడ్డి


హిందువు అయితే..?

రేవంత్ రెడ్డిపై అర్వింద్ విమర్శలు చేశారు. ‘రేవంత్ హిందువు అయితే జ్ఞానవాపీ, మధురపై తన స్టాండ్ ఏంటో చెప్పాలి. ప్రజలకు రేవంత్ రెడ్డి అంటే ఏంటో తెలుస్తోంది. ఆప్ కీ అదాలత్ కామెడీ షో. కేజ్రీవాల్ జైలు నుంచి పాలన చేయటాన్ని రేవంత్ సమర్థించారు. రేవంత్ కూడా జైలు నుంచి పరిపాలన చేయటానికి ప్రిపేర్ అవుతున్నారా..? లిక్కర్ పాలసీ కేసులో కవిత అరెస్ట్ కావడంతో నిజామాబాద్‌లో‌ లిక్కర్ ఫ్రీ ఎలక్షన్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులు దొరకటం లేదు. ఆ పార్టీకి 30 ఎంపీ సీట్లు కూడా రావు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటానికి నేతలు ఆసక్తి చూపటం లేదు అని’ అర్వింద్ మండిపడ్డారు.

Congress: తెలంగాణకు ఇచ్చిన హామీలు ప్రధాని మోదీ నెరవేర్చలేదు: మంత్రి పొన్నం


కృష్ణ మందిరం కూడా

కేసీఆర్, కేటీఆర్‌ను వదల్లేదు ధర్మపురి అర్వింద్. ‘రామ మందిరమే కాదు.. కృష్ణ మందిరం చూపిస్తాం. కేసీఆర్, కేటీఆర్‌కు ట్యాపింగ్‌తో సంబంధం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? గతంలో పదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చక్కర ఫ్యాక్టరీని ఎందుకు తెరపించలేదు..? ఫోన్ ట్యాపింగ్ అంశంతో కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ చేస్తోంది. ల్యాండ్ సెటిల్ మెంట్లు చేసుకుంటారని రేవంత్ రెడ్డికి పేరుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి ఎంపీ అభ్యర్థులను బరిలోకి దింపాయి అని’ ధర్మపురి అర్వింద్ విరుచుకుపడ్డారు.

BRS: అవన్నీ అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవే: కేటీఆర్


కాంగ్రెస్‌పై విమర్శలు

ఆరు గ్యారంటీల విషయంలో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అర్వింద్ మండిపడ్డారు. కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ మోచేతికి బెల్లం పెడుతుందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. జీరో కరెంట్ బిల్లు ఒక నెలకే పరిమితమైందని వివరించారు. బోనస్ ఇచ్చి.‌. వడ్లు కొంటామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చెప్తారని నిలదీశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అర్వింద్ మండిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 14 , 2024 | 04:47 PM