Share News

Fire Accident: స్కూల్ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది విద్యార్థులు సజీవ దహనం

ABN , Publish Date - Sep 06 , 2024 | 02:12 PM

పాఠశాల హాస్టల్లో జరిగిన భారీ అగ్నిప్రమాదం(fire accident)లో 17 మంది విద్యార్థులు మృతి చెందారు. మరో 13 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన కెన్యా(kenya) నైరోబీలోని నైరీ కౌంటీ పట్టణంలో జరిగింది.

Fire Accident: స్కూల్ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది విద్యార్థులు సజీవ దహనం
Kenyan school fire accident

ఓ పాఠశాల హాస్టల్ భవనంలో ఆకస్మాత్తుగా మంటలు(fire accident) చెలరేగాయి. ఆ క్రమంలో మంటలు భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. దీంతో అందులో నివసిస్తున్న విద్యార్థులు తమను తాము రక్షించుకోలేకపోయారు. ఈ క్రమంలో 17 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. మరో 13 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన కెన్యా(kenya) నైరోబీలోని నైరీ కౌంటీ పట్టణంలో చోటుచేసుకుంది. హిల్‌సైడ్ ఎండరాషా ప్రైమరీ పాఠశాల హాస్టల్ భవనంలో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఆ క్రమంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


దర్యాప్తు

అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని ప్రాథమిక విచారణలో చెబుతున్నా, పాఠశాల యాజమాన్యం, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు నివేదికను కోరిన కెన్యా ప్రభుత్వం, ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ అగ్నిప్రమాదంలో హాస్టల్ మొత్తం బూడిద కాగా, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


2017 నాటి ప్రమాదం

నిజానికి కెన్యాలోని ఏదైనా బోర్డింగ్ స్కూల్‌లో ఇంత భారీ అగ్నిప్రమాదం జరగడం మాములు విషయం కాదు. విద్యార్థులు చాలా సంవత్సరాలు బోర్డింగ్ పాఠశాలల్లో ఉంటారు. ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరగడం అంటే ఆలోచించాల్సిన విషయమని నిపుణులు అంటున్నారు. ఇది పాఠశాలల ప్రతిష్టతోపాటు అక్కడి నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తుందని అంటున్నారు. 2017లో నైరోబీలోని ఒక ఉన్నత పాఠశాలలో ఇదే విధమైన అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడు 10 మంది విద్యార్థులు సజీవదహనమయ్యారు. తాజాగా జరిగిన ప్రమాదం అప్పటి ప్రమాద జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది.


ఇవి కూడా చదవండి:

Union Minister: భద్రావతి స్టీల్‌ ప్లాంట్‌కు రూ.15వేల కోట్లు..


Kolkata Doctor Case: కోల్‌కతా కేసులో మరో ట్విస్ట్.. సీబీఐ క్లారిటీ ఇచ్చిందా?


Read More International News and Latest Telugu News

Updated Date - Sep 06 , 2024 | 02:24 PM