Share News

UFO: కెమెరాకు చిక్కిన UFO.. వైరల్ అవుతున్న వీడియో

ABN , Publish Date - Jul 01 , 2024 | 07:23 PM

గ్రహాంతర జీవులు ఉన్నాయా? లేవా? ఈ ప్రశ్నకు ఇంతవరకూ సరైన సమాధానం దొరకలేదు. కానీ.. అప్పుడప్పుడు ఆకాశంలో UFOలు చూశామని ఇప్పటికే చాలామంది చెప్పారు. అంతేకాదు.. విచిత్ర ఆకారంలో..

UFO: కెమెరాకు చిక్కిన UFO.. వైరల్ అవుతున్న వీడియో
UFO Caught On Camera

గ్రహాంతర జీవులు (Aliens) ఉన్నాయా? లేవా? ఈ ప్రశ్నకు ఇంతవరకూ సరైన సమాధానం దొరకలేదు. కానీ.. అప్పుడప్పుడు ఆకాశంలో UFOలు చూశామని ఇప్పటికే చాలామంది చెప్పారు. అంతేకాదు.. విచిత్ర ఆకారంలో ఉన్న జీవుల్ని సైతం చూశామంటూ ఎంతోమంది పేర్కొన్నారు. అందుకు సాక్ష్యాలైతే లేవు కానీ.. ‘ఏలిమన్స్’ ఉన్నాయని ఎంతోమంది నమ్ముతుంటారు. ఇలాంటి తరుణంలో.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే.. అందులో రికార్డ్ అయిన దృశ్యాలు వింతగా ఉండటమే కారణం.


ఈ వీడియోని జస్టిన్ స్టీవెన్సన్, డేనియల్ స్టీవెన్సన్ అనే కెనడియన్ జంట రికార్డ్ చేసింది. మే 14వ తేదీన ఈ జంట రాత్రి సమయంలో కాసేపు సేద తీరేందుకు మానిటోబాలోని ఫోర్ట్ అలెగ్జాండర్ వద్ద ఉన్న విన్నిపెగ్ నదికి వెళ్లారు. ఈ ఇద్దరు సరదాగా సమయం గడుపుతున్న సమయంలో.. ఆ నదికి అటువైపు ఏదో గుర్తు తెలియని కాంతి కనిపించింది. ఎలాగైతే కారుకి ముందు భాగంలో రెండు హెడ్‌లైట్స్ ఉంటాయో.. అలాంటి కాంతినే గుర్తించారు. దీంతో.. అది UFO అనుకొని వాళ్లు వెంటనే దాన్ని తమ కెమెరాలో బంధించారు. వాళ్లు వీడియో తీస్తుండగానే.. ఆకాశంలో నుంచి మరో రెండు లైట్లు ఒక్కసారిగా కనిపించాయి. అది చూసి వాళ్లిద్దరు కాస్త గందరగోళానికి గురయ్యారు.


‘‘మాకు ఇక్కడేదో విచిత్రంగా కనిపిస్తోంది. అదేంటో మాకు అర్థం కావడం లేదు. అది విమానమా? లేకపోతే ఇంకేమైననా? అదేంటో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మాకైతే అది ఆకాశంలో నిప్పులా వెలుగుతున్నప్పుడు అనిపిస్తోంది. అది చాలా కాంతివంతంగా ఉంది. అరె.. ఇంతలోనే మరో రెండు లైట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. చూస్తుంటే.. మనం ఏలియన్స్‌ని చూడబోతున్నామేమో అనిపిస్తోంది’’ అంటూ ఆ వీడియోలో మాటలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అది ఆర్మీ ట్రైనింగ్ అయ్యుండొచ్చని ఒకరంటే, మరొకరు ఇవి ప్రభుత్వానికి చెందిన UFO అయ్యుండొచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 01 , 2024 | 07:27 PM