United Airlines: వామ్మో.. టేకాఫ్ అయిన తర్వాత ఊడిన విమాన టైర్
ABN , Publish Date - Mar 08 , 2024 | 11:14 AM
టేకాఫ్ అయిన కాసేపటికే విమాన టైర్ ఊడింది. జపాన్‌కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ జెట్ విమానం గురువారం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరింది. విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. విమానం బయల్దేరిన కాసేపటికే టైర్ ఊడిపోయింది. ఆ వీడియో ఒకరు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
ఏబీఎన్ ఇంటర్నెట్: టేకాఫ్ అయిన కాసేపటికే విమాన టైర్ (Flight Tyre) ఊడింది. జపాన్‌కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ జెట్ విమానం (Flight) గురువారం శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) నుంచి బయల్దేరింది. విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. విమానం బయల్దేరిన కాసేపటికే టైర్ ఊడిపోయింది. ఆ వీడియో ఒకరు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
విమానం బయల్దేరిన వెంటనే టైర్ ఊడి, శాన్ ఫ్నాన్సిస్కోలో (San Francisco) గల ఉద్యోగుల పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న కార్లపై పడింది. ఆ ఘటనలో కారు వెనక ఉన్న అద్దం ధ్వంసం అయ్యింది. తర్వాత ఆ విమానాన్ని వెంటనే లాస్ ఏంజెల్స్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. మరో విమానంలో ప్యాసెంజర్స్‌ను పంపించారు. బోయింగ్ 777 విమానం 2002లో రూపొందించారని ఏవియేషన్ సంస్థ పేర్కొంది. ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారిస్తోంది. విమానం టైర్ ఊడడానికి గల కారణం దర్యాప్తులో తేలుతుందని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.