Share News

MCD Polls: 115 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలుపు, ఆప్ అభ్యర్థికి ఓట్లు నిల్

ABN , Publish Date - Sep 27 , 2024 | 05:43 PM

ఎంసీడిలో ఖాళీగా ఉన్న స్టాండింగ్ కమిటీ సభ్యుని ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎలాంటి పోటీ లేకుండా గెలుపొందారు. మున్సిపల్ అడిషనల్ కమిషనర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు.

MCD Polls: 115 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలుపు, ఆప్ అభ్యర్థికి ఓట్లు నిల్

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీకి ఖాళీ అయిన ఏకైక సీటును బీజేపీ (BJP) కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి సుందర్ సింగ్ (Sundar Singh) 115 ఓట్లు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పార్టీ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాలేదు. 'ఆప్' అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆ పార్టీ కౌన్సిలర్లు ఈ ఎన్నికలను బహిష్కరించగా, కాంగ్రెస్ సైతం ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. దీంతో పోటీ లేకుండానే బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అడిషనల్ కమిషనర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు.

Haryana Assembly Elections: ఎన్నికల వేళ 13 మంది నేతలపై కాంగ్రెస్ బహిష్కరణ వేటు


ఏం జరిగింది?

బీజేపీ నేత కమల్‌జిత్ షెరావత్ ఇటీవల వెస్ట్ ఢిల్లీ ఎంపీగా ఎన్నిక కావడంతో ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యుని పదవికి ఖాళీ ఏర్పడింది. గత గురువారంనాడు జరిగిన ఎంసీడీ సమావేశంలో ఎంసీడీ స్టాండిగ్ కమిటీ ఎన్నికను అక్టోబర్ 5వ తేదీకి మేయర్ షెల్లీ ఒబెరాయ్ వాయిదా వేశారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఈ వాయిదాను తోసిపుచ్చుతూ శుక్రవారం ఒంటిగంటకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఎంసీడీ కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ గురువారం ఆర్ధరాత్రి ఆదేశాలు జారీ చేశారు. కమిటీ ఆరో సీటు ఎన్నికకు ప్రిసైడ్ చేయాలని అడిషనల్ మునిసిపల్ కమిషనర్ జితేంద్ర యాదవ్‌ను ఆదేశించారు. అయితే, ఇంత స్వల్ప వ్యవధిలో ఎన్నికకు ఆదేశాలివ్వడం చట్టవిరుద్ధమని, షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5న ఎన్నికలు జరపాలని మేయర్ ఒబెరాయ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్‌కు లేఖ రాశారు. అయితే, ఎల్జీ ఆదేశాలకే కట్టుబడి స్టాండింగ్ కమిటీ సభ్యుని ఎన్నికను కమిషనర్ చేపట్టడంతో ఓటింగ్‌కు 'ఆప్' కౌన్సిలర్లు దూరంగా ఉండిపోయారు. తాజా ఎన్నికతో ఎంసీడీలోని 18 మంది సభ్యుల స్టాడింగ్‌ కమిటిలో బీజేపీ బలం10కి చేరింది. ఆప్‌కు 8 సీట్ల బలం ఉంది.


Read More National News and Latest Telugu News

రెడ్‌ బుక్‌ అమలు మొదలైంది!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2024 | 05:43 PM