BJP leader: బీజేపీ నాయకుడి ఇంట్లో పోలీసుల సోదాలు
ABN , Publish Date - Apr 10 , 2024 | 09:15 AM
అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అగ్రిమెంట్ పత్రాలను సృష్టించిన కేసులో నగరానికి చెందిన బీజేపీ నాయకుడు మీనాక్షి(BJP leader Meenakshi) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
- విల్లివాక్కంలో కలకలం
చెన్నై: అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అగ్రిమెంట్ పత్రాలను సృష్టించిన కేసులో నగరానికి చెందిన బీజేపీ నాయకుడు మీనాక్షి(BJP leader Meenakshi) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి యజమానురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అలాగే, నకిలీ పత్రాలు తయారీకి సహకరించిన విల్లివాక్కం బీజేపీ(BJP) విభాగ నేత ముత్తుపాండ్యన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో విల్లివాక్కంలోని ఆయన నివాసంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరుమంగళం ప్రాంతానికి చెందిన శోభన (55) కు చెందిన ఇంట్లో మీనాక్షి అద్దెకుంటున్నారు. అయితే, శోభన సంతకం చేసినట్టుగా నకిలీ పత్రాలను సృష్టించి ఇంట్లోనే బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శోభన... పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి, నకిలీ పత్రాల తయారీ కేసులో మీనాక్షిని అరెస్టు చేయగా, ఆయనకు సహకరించిన బీజేపీ ప్రముఖుడు ముత్తుపాండ్యన్ కోసం గాలిస్తున్నారు.
ఇదికూడా చదవండి: DSP: ఈ డీఎస్పీ మామూలోడు కాదు.. ఏం చేశాడో తెలుసా.. లేడీ కానిస్టేబుల్‌తో రహస్య కాపురం