Election 2024: రెండు చోట్ల ఓట్ వేయవచ్చా, వేస్తే ఏమవుతుంది
ABN , Publish Date - May 11 , 2024 | 08:02 AM
దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు(lok sabha elections 2024) సంబంధించిన 4వ దశ ఓటింగ్ మే 13న జరగనుంది. ఈ క్రమంలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అయితే కొంత మందికి ఓటర్ల పేర్లు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి, రెండు ఓటరు కార్డులు(two votes) కల్గి ఉంటారు. ఇలాంటి క్రమంలో వారు రెండు చోట్ల ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చా, ఉపయోగించుకుంటే ఏమవుతుందనేది ఇప్పుడు చుద్దాం.
దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు(lok sabha elections 2024) సంబంధించిన 4వ దశ ఓటింగ్ మే 13న జరగనుంది. ఈ క్రమంలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్(ap elections 2024) సహా పలు ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు అనేక చోట్ల వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
అయితే కొంత మందికి ఓటర్ల పేర్లు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి, రెండు ఓటరు కార్డులు(two votes) కల్గి ఉంటారు. ఇలాంటి క్రమంలో వారు రెండు చోట్ల ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చా, ఉపయోగించుకుంటే ఏమవుతుంది. అసలు చట్టాలు ఏం చెబుతున్నాయనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
సాధారణంగా ఒక వ్యక్తికి ఒకే ఓటరు కార్డు(voter id) ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ప్రజలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండి ఓటరు కార్డు కోసం అప్లై చేస్తే వారికి రెండు ఓటరు కార్డులు లభిస్తాయి. అయితే వారికి రెండు ఓటరు కార్డులు ఉంటాయి. కానీ రెండు ఓటరు కార్డులు ఉంటే ఎన్నికల సంఘం నిబంధన ప్రకారం ఏదైనా ఒకటి మాత్రమే వినియోగించుకోవాలి. రెండోది పరిగణలోకి తీసుకోరు. అందుకే ఎవరికైనా రెండు ఓటరు కార్డులు ఉంటే అందులో ఒక దానిని రద్దు చేసుకోవాలి. వాటిలో ఒక ఓటు హక్కును మాత్రమే వినియోగించుకోవాలి. రెండు చోట్ల ఓటు వేస్తే చట్టరీత్యా నేరం.
మరోవైపు ఒక వ్యక్తికి రెండు ఓటరు కార్డులు ఉన్నట్లు తేలితే అది ఎన్నికల సంఘంలోని రూల్ 17ను ఉల్లంఘించినట్లే. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా రెండు ఓటరు కార్డులతో కనిపిస్తే చట్టం ప్రకారం సంవత్సరం జైలు(jail) శిక్ష విధించబడుతుంది. రెండు ఓటింగ్ కార్డుల వ్యవహారం ఇప్పటికే అనేక చోట్ల పరిష్కారమవుతోంది. కానీ కొంతమందికి ఇంకా పెండింగ్ ఉన్నట్లైతే వారు ఓటింగ్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం మొత్తం జనాభా 140 కోట్లు దాటింది. వీరిలో దాదాపు 80% మంది ఓటు హక్కు కలిగి ఉండగా, గణాంకాల ప్రకారం 70% మంది మాత్రమే ఓటు హక్కును కల్గి ఉన్నారు.
ఇది కూడా చదవండి:
West Bengal: మహువానా? మహారాణా?
Election Commission: మా ఫిర్యాదులు పట్టవా?
Read Latest National News and Telugu News