Share News

Chennai: ఎయిర్‌పోర్ట్‌కు మళ్లీ బాంబు బెదిరింపు.. రాత్రంతా కొనసాగిన తనిఖీలు

ABN , Publish Date - Jun 18 , 2024 | 11:49 AM

స్థానిక మీనంబాక్కం(Meenambakkan)లోని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలలో బాంబులు పేలనున్నాయని గుర్తుతెలియని వ్యక్తి బెదిరించడంతో బాంబ్‌స్క్వాడ్‌ నిపుణులు, భద్రతాదళం ఉన్నతాధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.

Chennai: ఎయిర్‌పోర్ట్‌కు మళ్లీ బాంబు బెదిరింపు.. రాత్రంతా కొనసాగిన తనిఖీలు

- రెండువారాల్లో ఇది ఐదవ బెదిరింపు

చెన్నై: స్థానిక మీనంబాక్కం(Meenambakkan)లోని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలలో బాంబులు పేలనున్నాయని గుర్తుతెలియని వ్యక్తి బెదిరించడంతో బాంబ్‌స్క్వాడ్‌ నిపుణులు, భద్రతాదళం ఉన్నతాధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ విమానాశ్రయాలకు రెండు వారాలలో వ్యవధిలో ఇలా బాంబు బెదిరింపులు రావటం ఇది ఐదోసారి అని భద్రతా విభాగం అధికారులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి విమానాశ్రయం డైరెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన ఈ-మెయిల్‌ సందేశంలో విమానాశ్రయాలలో బాంబులు అమర్చి ఉన్నాయని, త్వరలో అవి పేలనున్నాయని పేర్కొనడంతో అధికారులు తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. వెంటనే ఆ సమాచారాన్ని భద్రతాదళం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో బాంబ్‌స్క్వాడ్‌ నిపుణులు మెటల్‌ డిటెక్టర్లు, జాగిలాలతో హుటాహుటిన అక్కడికి చేరుకుని ముమ్మర తనిఖీలు జరిపారు. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులను, వారి లగేజీలను మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీ చేశారు. ఇదే విధంగా విమానాశ్రయాలకు వచ్చిన వాహనాలను, వాటి డిక్కీలను తెరచి మరీ మెటల్‌ డిటెక్టర్లతో సోదాలు జరిపారు.

ఇదికూడా చదవండి: MP Eetala: మీ కాలుకు ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా..


ఈ తనిఖీలు సోమవారం వేకువజాము వరకు కొనసాగటంతో రెండు విమానాశ్రయాల వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు సందేశాలు ఈమెయిల్‌ రూపంలో వస్తుండటంతో ఆ సందేశాలను పంపినవారి చిరునామాలు ఇతర వివరాలను కనుగొనలేక భద్రతా దళం అధికారులు సతమతమవుతున్నారు. గత రెండు వారాల వ్యవధిలో, ఫోన్‌ద్వారా, ఈమెయిల్‌ ద్వారా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు రావటం ఇది ఐదోసారి అని అధికారులు చెబుతున్నారు. రెండు విమానాశ్రయాలలో విమాన సేవలకు, విమాన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా బాంబు తనిఖీలు కొనసాగించినట్లు భద్రతాదళం సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇలా పనిగట్టుకుని బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నవారిని వెనువెంటనే కనుగొనలేకపోయినా సైబర్‌ క్రైం విభాగం సాయం ద్వారా దుండగులను కనుగొని వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 11:49 AM