Share News

Chennai: నమిత బాధ పడితే క్షమాపణ చెబుతాం...

ABN , Publish Date - Aug 28 , 2024 | 01:11 PM

మదురై మీనాక్షి ఆలయం(Madurai Meenakshi Temple)లో సోదరి నమిత మనసుకు బాధకలిగించే విషయాలు జరిగి ఉంటే తాము క్షమాపణ చెబుతామని దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) ప్రకటించారు.

Chennai: నమిత బాధ పడితే క్షమాపణ చెబుతాం...

- మంత్రి పీకే శేఖర్‌బాబు

చెన్నై: మదురై మీనాక్షి ఆలయం(Madurai Meenakshi Temple)లో సోదరి నమిత మనసుకు బాధకలిగించే విషయాలు జరిగి ఉంటే తాము క్షమాపణ చెబుతామని దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) ప్రకటించారు. నగరంలోని పురుషవాక్కం గంగాధీశ్వరాలయంలో రూ.3.86 కోట్లతో జరుగుతున్న జీర్ణోద్ధరణ పనులను మంగళవారం ఉదయం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గతంలో పళని దేవాలయంలో ఇలాంటి సంఘటనకు సంబంధించిన కేసులో వెలువడిన తీర్పు ప్రకారం నమిత ముస్లిం మతానికి చెందినవారై ఉంటారనే సందేహంతో ఆలయ సిబ్బంది అలా ప్రవర్తించి ఉంటారని భావిస్తున్నామన్నారు.

ఇదికూడా చదవండి: Former Minister: ఎన్ని జన్మలెత్తినా మా పార్టీని నాశనం చేయలేరు..


నమితకు ఎదురైన సంఘటపై కమిషనర్‌ విచారణకు ఆదేశించారని, సోదరి నమిత మనస్సుకు బాధకలిగి ఉంటే లేదా అవాంఛనీయంగా చట్ట వ్యతిరేకంగా ఏదైనా జరిగి ఉంటే ఆ విషయాలపై సమగ్రంగా విచారణ జరిపి కఠిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేల సంఖ్యలో ప్రాచీన, సుప్రసిద్ధ ఆలయాల్లో మరమ్మతులు చేపట్టి, మహా కుంభాభిషేకాలు నిర్వహించిందని, ఆ రీతిలోని పురుషవాక్కం గంగాధీశ్వరాలయంలో రూ.81 లక్షలతో కొయ్య రథాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మంత్రితోపాటు దేవాదాయ శాఖ కమిషనర్‌ పీఎన్‌ శ్రీధర్‌, డిప్యూటీ కమిషనర్‌ ఐ.ముల్లై, ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్‌ వెట్రికుమార్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి రామరాజా తదితరులు పాల్గొన్నారు.


........................................................

ఈ వార్తను కూడా చదవండి:

..........................................................

Vande Bharat Train: 31న చెన్నై-నాగర్‌కోయిల్‌ మధ్య వందేభారత్‌ రైలు

- ప్రారంభించనున్న ప్రధాని

చెన్నై: చెన్నై-నాగర్‌కోయిల్‌ మధ్య వందే భారత్‌ రైలు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు దక్షిణ రైల్వే వర్గాలు తెలిపాయి. దేశ ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన మోదీ జూన్‌ 20వ తేది నగరానికి వస్తారని ప్రకటించారు. ప్రధాని నగర పర్యటనలో భాగంగా వందే భారత్‌ రైలు(Vande Bharat Train) సహా, దక్షిణ రైల్వేలో పలు పథకాలు ప్రారంభిస్తారని ప్రకటించారు. సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ లో ఈ కార్యక్రమం కోసం రైల్వే, పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

nani3.jpg


కానీ, అనివార్య కారణాలతో ప్రధాని పర్యటన రద్దయింది. ఈ నేపథ్యంలో, ఈ నెల 31న చెన్నై-నాగర్‌కోయిల్‌ వందే భారత్‌ రైలు సేవలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ విషయమై దక్షిణ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ.... చెన్నై-నాగర్‌కోయిల్‌ మఽధ్య డైలీ వందే భారత్‌ రైలు, బెంగళూరు-మదురై వందే భారత్‌ రైలు సేవలను 31న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభిస్తారని, అలాగే, మరికొన్ని పథకాలు కూడా ప్రధాని ప్రారంభించనున్నారని, ఏఏ పథకాలు ప్రారంభిస్తారు అనే వివరాలు మరో రెండు రోజుల్లో అధికారపూర్వకంగా తెలుస్తాయని ఆయన తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 28 , 2024 | 01:11 PM