Share News

Chennai: ఒక్క దళితుడు కూడా ముఖ్యమంత్రి కాలేదు..

ABN , Publish Date - Aug 15 , 2024 | 12:15 PM

ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ కాలంలోనైనా దళితుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరని డీపీఐ అధ్యక్షుడు తిరుమావళన్‌(DPI President Thirumavalan) ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్‌ కులాల రిజర్వేషన్‌ హరించివేసే సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తూ డీపీఐ ఆధ్వర్యంలో నగరంలో ఆందోళన నిర్వహించారు.

Chennai: ఒక్క దళితుడు కూడా ముఖ్యమంత్రి కాలేదు..

- డీపీఐ అధ్యక్షుడు తిరుమావళవన్‌

చెన్నై: ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ కాలంలోనైనా దళితుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరని డీపీఐ అధ్యక్షుడు తిరుమావళన్‌(DPI President Thirumavalan) ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్‌ కులాల రిజర్వేషన్‌ హరించివేసే సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తూ డీపీఐ ఆధ్వర్యంలో నగరంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్‌ మాట్లాడుతూ... ఉత్తరప్రదేశ్‌లో గతంలో మాయావతి(Mayawati) ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆ తర్వాత దేశంలో ఏ రాష్ట్రానికి కూడా దళితుడు ముఖ్యమంత్రి(Chief Minister) కాలేదన్నారు.

ఇదికూడా చదవండి: Actor Dalapathy Vijay: విక్రవాండిలో వీకే తొలి మహానాడు..


ఈ విషయమై, పార్లమెంటులో ఎందుకు చర్చించరో అందరికీ తెలిసిందేనన్నారు. రాష్ట్రంలో కూడా ఒక దళితుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు అంగీకరించరు... కాలేరు కూడా అని అన్నారు. వన్నియర్లకు 10.5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ కోరిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి, ఏ ఇతర సామాజిక వర్గాన్ని పట్టించుకోకుండా, ఎవరితో సంప్రదించకుండా, అఖిలపక్ష ఏర్పాటుచేయకుండా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ఆ అంతర్గత కేటాయింపు న్యాయపరమైన చిక్కుల్లో పడి నేటికీ స్తబ్దుగా ఉందన్నారు.


అంతర్గత కేటాయింపు అధికారాన్ని రాష్ట్రప్రభుత్వాల చేతుల్లో పెట్టకూడదని భావించిన అంబేడ్కర్‌, రాజ్యాంగంలో ఎస్సీలందరినీ ఒకే షెడ్యూల్‌గా చేర్చారని తెలిపారు. తర్వాత అది సరికాదని గుర్తించి దానికి ఆర్టికల్‌ 341,342, జోడించారని తెలిపారు. 341 జాబితా సమాజానికి సంబంధించిందని, గిరిజన సంఘం గురించి 342పై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్లమెంటులో చర్చించి రాష్ట్రపతి ఆమోదంతోనే తీసుకురావాలని అంబేడ్కర్‌ తీసుకొచ్చారన్నారు. డీఎంకే ప్రభుత్వం(DMK Govt)పై మాకు నమ్మకం ఉందని, రాష్ట్రప్రభుత్వం సుస్థిరంగా ఉందన్నారు.


దేశంలో షెడ్యూల్డ్‌ కమ్యూనిటీ అధికంగా ఉన్న రాష్ట్రం పంజాబ్‌ అని, అక్కడ ఎస్సీ, ఎస్టీల జనాభా 32 శాతం ఉందన్నారు. 32 శాతం సంఘం స్వతహాగా రాజకీయ శక్తిగా ఆవిర్భవిస్తే, వారు శాశ్వత అధిపతులు కాగలరని, కానీ, ముందుగానే 1975లో వర్గీకరణ పేరుతో దాన్ని బద్దలు కొట్టారని తిరుమావళవన్‌ పేర్కొన్నారు. కాగా, తిరుమావళవన్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం, నామ్‌ తమిళర్‌ పార్టీ అధ్యక్షుడు సీమాన్‌ ఆహ్వానించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 15 , 2024 | 12:15 PM