Share News

Delhi water crisis: మా వాటా నీళ్లివ్వకుంటే సత్యాగ్రహ దీక్ష.. ప్రధానికి అతిషి లేఖ

ABN , Publish Date - Jun 19 , 2024 | 02:57 PM

దేశ రాజధానిలో కొనసాగుతున్న నీటి సంక్షోభాన్ని తక్షణం పరిష్కరించకుంటే ఈనెల 21 నుంచి నిరవధిక దీక్షకు దిగుతానని రాష్ట్ర మంత్రి అతిషి అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారంనాడు లేఖ రాశారు. ఢిల్లీ ప్రజానీకం ఎదుర్కొంటున్న నీటి కొరత, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటి పరిష్కారానికి తక్షణమే ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు.

Delhi water crisis: మా వాటా నీళ్లివ్వకుంటే సత్యాగ్రహ దీక్ష.. ప్రధానికి అతిషి లేఖ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొనసాగుతున్న నీటి సంక్షోభాన్ని (water crisis) తక్షణం పరిష్కరించకుంటే ఈనెల 21 నుంచి నిరవధిక దీక్ష (indefinite strike)కు దిగుతానని రాష్ట్ర మంత్రి అతిషి (Atishi) అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి లేఖ (Letter) రాశారు. ఢిల్లీ ప్రజానీకం ఎదుర్కొంటున్న నీటి కొరత, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటి పరిష్కారానికి తక్షణమే ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని బుధవారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అతిషి తెలిపారు.


''ఈరోజు ప్రధాన మంత్రికి నేను లేఖ రాశాను. ఢిల్లీలోని 28 లక్షల మంది ప్రజానీకానికి నీళ్లు రావడం లేదనే విషయాన్ని విన్నవించాను. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు నీరు అందేలా సాయం చేయాలని కోరాను. 21వ తేదీ కల్లా ఢిల్లీ ప్రజలకు దక్కాల్సిన నీటి వాటా రాకుంటే సత్యాగ్రహానికి దిగడం మినహా నాకు మరో మార్గం లేదు'' అని అతిషి తెలిపారు. జలాలకు సంబంధించిన సింహ భాగం వాటాను హర్యానా విడుదల చేయకపోవడంతో ఢిల్లీ నీటి సంక్షోభంలో పడిందన్నారు. మంగళవారంనాడు 613 ఎంజీడీలకు గాను 513 ఎంజీడీల జలాలను మాత్రమే హర్యానా విడుదల చేసిందని, ఒక్క ఎంజీడీ జలం 28,500 మందికి వెళ్తుందని, ఆ ప్రకారం 28 లక్షల మందికి నీరు అందడం లేదని ఆమె వివరించారు. ఢిల్లీ ప్రజలు తీవ్రమైన ఎండలతో పాటు నీటి కొరతను కూడా ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తెచ్చానని, రెండ్రోజుల్లోగా నీటి సమస్య పరిష్కరించకుంటే ఈనెల 21 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు వెళ్తానని చెప్పారు. హర్యానా ప్రభుత్వానికి కూడా సమస్య పరిష్కారం కోసం చాలా లేఖకు రాసినట్టు వివరించారు.

Bomb Threat: 50కిపైగా ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు.. హెడ్ క్వార్టర్‌ పేల్చివేస్తామని..


ఆప్ సర్కార్‌పై బీజేపీ ఎదురుదాడి..

మరోవైపు, ఢిల్లీలో నీటి సంక్షోభానికి ఆప్ ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర విభాగాలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్, ఎంపీ బన్సూరి స్వరాజ్ బుధవారంనాడు ఇందిరా క్యాంప్ ఏరియాలో నిరసనలు చేపట్టారు. హర్యానా ప్రభుత్వం పూర్తి నీటి వాటాను యమునా నదిలోకి వదలిందని, అయితే జలాలు ఢిల్లీలోకి అడుగుపెట్టగానే ట్యాంకర్ మాఫియా ఆ నీళ్లు దొంగిలిస్తోందని చెప్పారు. ట్యాంకర్ మాఫియాకు ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు కొమ్ముకాస్తుండమే ఇందుకు కారణమని సచ్‌దేవ ఆరోపించారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 02:58 PM