Share News

EC invites Congress: మీ అనుమానాలు నివృత్తి చేస్తాం.. కాంగ్రెస్ ప్రతినిధులకు ఈసీ పిలుపు

ABN , Publish Date - Nov 30 , 2024 | 06:16 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈసీ తాజా ఆహ్వానం పంపింది. నేరుగా తమను కలవాలని, అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపింది.

EC invites Congress: మీ అనుమానాలు నివృత్తి చేస్తాం.. కాంగ్రెస్ ప్రతినిధులకు ఈసీ పిలుపు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శాతంపై కాంగ్రెస్ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆ పార్టీ ప్రతినిధి బృందాన్ని డిసెంబర్ 3న తమను కలవాలని ఎన్నికల కమిషన్ (EC) ఆహ్వానించింది. ఎన్నికలు ప్రతి దశలోనూ పారదర్శకంగా జరిగాయని ఈసీ పేర్కొంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈవీఎంల ప్రక్రియపై కూడా కాంగ్రెస్ సందేహాలను వ్యక్తం చేసింది.


''ప్రతిదశలోనూ పారదర్శకంగానే ఎన్నికలు జరిగాయి. చట్టపరమైన ఆందోళనలను మేము పరిశీలిస్తాం. కాంగ్రెస్ ప్రతినిధుల అనుమానాలను వినడంతో పాటు రాతపూర్వకంగా సమాధానం ఇస్తాం'' అని ఈసీ తెలిపింది. మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈసీ తాజా ఆహ్వానం పంపింది. నేరుగా తమను కలవాలని, అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపింది.


హర్యానా ఎన్నికల్లోనూ అవకతవకలు: కేసీ వేణుగోపాల్

హర్యానా అసెంబ్లీ ఫలితాలను ఎన్నికల్లో జరిగిన అవకతవకలు ప్రభావితం చేసినట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో ఆరోపించారు. అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చినట్టు సీడబ్ల్యూసీ గుర్తించిందన్నారు. మహారాష్ట్ర ఫలితాలు కూడా దిగ్భ్రాంతికి గురిచేశాయనే అభిప్రాయం సీడబ్ల్యూసీలో వ్యక్తమయిందని, చాలా స్పష్టంగా అవకతవకలు జరిగినట్టు అవగతమవుతోందని అన్నారు. అధికారికంగా పోలింగ్ సమయం పూర్తయిన తర్వాత ఓటింగ్ శాతం 7.83 శాతం ఎలా పెరిగిందో తామ తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేల్ ఈసీకి లేఖ సైతం రాశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌సీపీ ఎస్‌పీ, శివసేన యూబీటీతో కూడిన 'మహా వికాస్ అఘాడి' కేవలం 46 సీట్లు గెలుచుకోగా, 'మహాయుతి' కూటమిలోని బీజేపీ 132, ఏక్‌నాథ్ షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్‌సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి.


ఇవి కూడా చదవండి

Eknath Shinde: షిండే అలక వెనుక కారణం ఇదే

Special trains: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా ఊటీకి ప్రత్యేక రైళ్లు

Suburban trains: ఇక.. సబర్బన్‌ రైళ్లకు ఏసీ బోగీలు

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 30 , 2024 | 06:16 PM