Breaking News: త్వరలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్..?
ABN , Publish Date - Mar 05 , 2024 | 12:25 PM
లోక్ సభ ఎన్నికలషెడ్యూల్ 15 నుంచి 20 రోజుల్లో రాబోతుందని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ గురించి జమ్ముకశ్మీర్ ఎన్నికల అధికారి పీకే పోల్ హింట్ ఇచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారని వివరించారు. ఎన్నికలకు ముందు గల పరిస్థితులను పరిశీలిస్తున్నారని వెల్లడించారు.
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల (Loksabha Elections) షెడ్యూల్ 15 నుంచి 20 రోజుల్లో రాబోతుందని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ (Schedule) గురించి జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) ఎన్నికల అధికారి పీకే పోల్ హింట్ ఇచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని సీనియర్ అధికారులు అంచనా వేస్తున్నారని వివరించారు. ఎన్నికలకు ముందు గల పరిస్థితులను పరిశీలిస్తున్నారని వెల్లడించారు.
‘అనంత్ నాగ్, కుల్గమ్, సోఫియా జిల్లా అధికారులను కలిశాను. గత ఎన్నికల కంటే మెరుగ్గా ఎన్నికలు నిర్వహించాలని సూచించాను. శాంతియుతంగా, పారదర్శకంగా, నిష్పాక్షపాతంగా ఎన్నికలు జరగాలని ఆదేశించాను. మార్చి 13వ తేదీ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఆ లోపు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులు పూర్తి కావాలని స్పష్టం చేశాను. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 97 కోట్ల మంది ఓటర్లు ఓటు వేస్తారు. లోక్ సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. లోక్ సభ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది అని’ జమ్ము కశ్మీర్ ఎన్నికల అధికారి పీకే పోల్ వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.