Share News

GST: రూ.2.22 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆటోడ్రైవర్‌కు జీఎస్టీ నోటీసు..

ABN , Publish Date - Dec 14 , 2024 | 11:26 AM

వాణియంబాడి సమీపం పెరియపేట్టై ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ మున్వర్‌బాషా కారు కొనేందుకు బ్యాంక్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకు రూ 2.22 కోట్ల జీఎస్టీ(GST) బకాయిల నోటీసు అందింది.

GST: రూ.2.22 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆటోడ్రైవర్‌కు జీఎస్టీ నోటీసు..

చెన్నై: తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపం పెరియపేట్టై ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ మున్వర్‌బాషా కారు కొనేందుకు బ్యాంక్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకు రూ 2.22 కోట్ల జీఎస్టీ(GST) బకాయిల నోటీసు అందింది. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించమంటూ ఆ నోటీసులో ఉండడంతో దిగ్ర్భాంతి చెందిన మున్వర్‌బాషా.. ఆ నోటీసు రావడానికి బ్యాంక్‌ రుణం కోసం మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తే కారణమని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వార్తను కూడా చదవండి: Supreme Court: మంత్రిగా సెంథిల్‌ బాలాజీ ఎలా కొనసాగుతున్నారు...


వాణియంబాడి ప్రాంతంలో ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్న మున్వర్‌బాషాకు అదే ప్రాంతంలో కోట్టై వీధికి చెందిన కాశిం అహమ్మద్‌తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకు ముందు కాశిం అహమ్మద్‌ అతడికి వద్దకు వచ్చి ఆటోలు నడిపితే తక్కువ ఆదాయం వస్తుందని, కారు నడిపితే ఎక్కువ సంపాదన పెరుగుతుందని తెలిపారు. కారు కొనేందుకు తన వద్ద డబ్బు లేదని మున్వర్‌బాషా చెప్పగా, ఓ బ్యాంక్‌ నుండి రుణం మంజూరు చేయిస్తానని కాశిం తెలిపి అతడి ఆధార్‌, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్‌ ఫొటోలు(Aadhaar, PAN card, passport photos) తీసుకుని తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించుకున్నాడు.


nani3.jpg

రుణం కోసం ఎదురు చేసూ మున్వర్‌బాషాకు రెండు రోజులకు ముందు రిజిస్టర్‌ తపాలాలో ఓ నోటీసు అందింది. దానిని చదివి అతడు తీవ్ర దిగ్ర్భాంతి చెందాడు. ఆ నోటీసులో మున్వర్‌బాషా(Munwarbasha) పెరంబూరులో కొత్తగా ప్రారంభించిన కర్మాగారం ఆర్థిక లావాదేవీల ప్రకారం జీఎస్టీగా రూ.2.22,95,859లను చెల్లించాల్సి ఉందని, వెంటనే ఆ పన్ను బకాయిలు చెల్లించమని ఉండటంతో హతాశుడయ్యాడు.


బ్యాంక్‌ రుణం కోసం కాశీం తీసుకెళ్ళిన ఆధార్‌, పాన్‌కార్డ్‌ ఉపయోగించి తన పేరుమీద పెరంబూరులో ఫ్యాక్టరీ ప్రారంభించి ఇలాంటి మోసానికి పాల్పడినట్లు గ్రహించి మున్వర్‌బాషా వాణియంబాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘరానా మోసానికి పాల్పడిన కాశీం అహమ్మద్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు

ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి

ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

Read Latest Telangana News and National News


Updated Date - Dec 14 , 2024 | 11:26 AM