Share News

IndiGo: విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు

ABN , Publish Date - Jun 01 , 2024 | 02:31 PM

ఇండిగో విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా దించారు. అనంతరం విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఇవి నకిలీ బాంబు బెదిరింపు అని భద్రత సిబ్బంది నిర్ధారించారు..

IndiGo: విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు

ముంబై, జూన్ 01: ఇండిగో విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా దించారు. అనంతరం విమానాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఇవి నకిలీ బాంబు బెదిరింపు అని భద్రత సిబ్బంది నిర్ధారించారు. శనివారం ఉదయం చెన్నై నుంచి ముంబైకి ఇండిగో విమానం బయలుదేరింది. ఆ కొద్దిసేపటికే ఆ విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో.. ముంబై ఎయిర్లో పోర్ట్‌లో విమానాన్ని అత్యవసరంగా దించేశారు.

Also Read: Lok Sabha Elections: మోదీ బాటలోనే..


అనంతరం విమానం నుంచి ప్రయాణికులకు దింపి వేసి.. ఆ తర్వాత ప్రత్యేక టెర్మినల్ వద్దకు విమానాన్ని తరలించి తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో విమానంలో బాంబు లేవని భద్రతా సిబ్బంది నిర్థారించారు. అయితే చెన్నై నుంచి ముంబై వచ్చిన ఈ విమానంలో మొత్తం 172 మంది ప్రయాణికులు ఉన్నారని ఇండిగో సంస్థ తెలిపింది. మరోవైపు ఆ విమానం‌లో బాంబు లేకపోవడంతో.. చెన్నై‌కు ఆ విమాన సర్వీస్‌ను ఏర్పాటు చేశారు. అందులోభాగంగా విమానాన్ని ఎయిర్ పోర్ట్‌ టెర్మినల్ వద్దకు తీసుకు వచ్చారు.

Also Read: పోలింగ్ కేంద్రానికి దొంగలు..ఓటింగ్ పత్రాలు చోరీ, మెషీన్లు చెరువులో విసిరివేత


ఇక ఈ వారంలో ఇండిగో విమానానికి ఇది రెండో బాంబు బెదిరింపు అని ఆ సంస్థ గుర్తు చేసింది. గత నెల మే 28వ తేదీ ఢిల్లీ నుంచి వారణాసి బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా దింపి వేసి భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత ఇది నకిలీ బాంబు బెదిరింపు అని గుర్తించినట్లు ఇండిగో సంస్థ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నాగపూర్, జైపూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు రావడం.. అనంతరం భద్రత సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం.. ఆ తర్వాత ఇవి నకిలీ బాంబు బెదిరింపులని అధికారులు నిర్ధారించిన విషయం విధితమే.

For Latest News and National News click here

Updated Date - Jun 01 , 2024 | 02:40 PM