Share News

Jagannath Puri Rath Yatra Photos: కమనీయం, రమణీయం.. జగన్నాథుడి రథోత్సవం

ABN , Publish Date - Jul 07 , 2024 | 06:56 PM

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర కనులపండువగా జరుగుతోంది. ఒడిశాతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పూరీ ఆలయానికి తరలివస్తున్నారు. జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో పూరీ విధులన్నీ మార్మోగుతున్నాయి.

Jagannath Puri Rath Yatra Photos: కమనీయం, రమణీయం.. జగన్నాథుడి రథోత్సవం

  • ఉత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ రఘుబర్‌దాస్‌, సీఎం మోహన్‌ చరణ్‌ మాంఝి

భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర కనులపండువగా జరుగుతోంది. ఒడిశాతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పూరీ ఆలయానికి తరలివస్తున్నారు.

జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో పూరీ విధులన్నీ మార్మోగుతున్నాయి. 53 ఏళ్ల తరువాత పూరీ జగన్నాథుడి రథయాత్ర(Jagannath Puri Rath Yatra) రెండు రోజులపాటు కొనసాగుతోంది.


ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున రత్నసింహాసనంపై చతుర్థామూర్తులు కొలువు దీరారు. అనంతరం జగన్నాథుడిని అలంకరించారు. మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాల వల్లభ సేవల తర్వాత 10 గంటలకు నేత్రోత్సవం నిర్వహించారు.

మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ రథాలపై చెరాపహరా చేశారు. సాయంత్రం 4 గంటలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టి 5 గంటలకు బలభధ్రుని తాళధ్వజ రథం లాగారు. తర్వాత దేవీ సుభద్ర దర్పదళన్ అనంతరం పురుషోత్తముని నందిఘోష్‌ రథం తల్లి సన్నిధి వెళ్లింది. యాత్రను విజయవంతం చేయడానికి ఒడిశా సర్కార్ ఘన ఏర్పాట్లు చేసింది.

తొలిసారి రాష్ట్రపతి రాక..

ఒడిశాలో ఏటా జరుపుకునే పూరీ రథయాత్రకు రాష్ట్రపతులెవరూ ఇప్పటి వరకు రాలేదు. తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. గవర్నర్‌ రఘుబర్‌దాస్‌తో కలిసి రాష్ట్రపతి సుభద్రమ్మ రథం లాగారు. ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాంఝి, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు రథోత్సవానికి హాజరయ్యారు. కాగా రాష్ట్రపతి స్వరాష్ట్రం ఒడిశానే కావడం విశేషం. పూరీ వీధుల్లో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మూడంచెల భద్రత నడుమ బలగాలు గస్తీ కాస్తున్నాయి.

రథోత్సవం ఫొటోలు చూద్దాం..

jagannath2.jpg

jagannath4.jpg

jagannath5.jpg


jagannath3.jpg

jagannath1.jpg

jagannath6.jpg

jagannath8.jpg

Updated Date - Jul 07 , 2024 | 07:32 PM