Share News

Maharashtra Polls: 99 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా.. బరిలో ప్రముఖులు

ABN , Publish Date - Oct 20 , 2024 | 04:09 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ఆదివారంనాడు విడుదల చేసింది. 99 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది.

Maharashtra Polls: 99 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా.. బరిలో ప్రముఖులు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ (BJP) ఆదివారంనాడు విడుదల చేసింది. 99 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది. పలువురు పార్టీ ప్రముఖుల పేర్లు ఇందులో చేటుచేసుకున్నారు. నాగపూర్ సౌత్ వెస్ట్ విధాన్ సభ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis), కంప్తీ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే, ఘట్కోపార్ వెస్ట్ నుంచి రామ్ కదమ్, చిక్లి నుంచి శ్వేత మహలె పాటిల్, భోకర్ నుంచి శ్రీజయ అశోక్ చవాన్, కాంకావ్లి నుంచి నితీష్ రాణే పోటీ చేయనున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కుమార్తె అయిన శ్రీజయ అశోక్ చవాన్ గత ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

Shrikant Shinde: సీఎం తనయుడి అపచారం... అధికారిపై వేటు


మహారాష్ట్రలోని అధికార మహాయుతి (బీజేపీ-ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీ) కూటమికి, విపక్ష మహా వికాస్ అఘాడి (శివసేన-యూబీటీ, ఎన్‌సీపీ శరద్ పవార్, కాంగ్రెస్) మధ్య హోరాహోరీగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోరు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తు్న్నారు. ఎన్నికల అనంతరం తిరిగి అధికారంలోకి వస్తామని మహాయుతి కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చినట్టే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు కూడా తమకే అధికారం కట్టబెడతాయని మహా వికాస్ అఘాడి చెబుతోంది. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Union Minister: మరోసారి నేనే సీఎం.. సిద్దూ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగదు

Updated Date - Oct 20 , 2024 | 04:09 PM