Share News

LokSabha: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నోటీసులు

ABN , Publish Date - Aug 08 , 2024 | 11:16 AM

ఇక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరికాసేపట్లో లోక్‌సభలో ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబిసి ముస్లింలు, షియా, బోహ్ర తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ చట్టానికి దాదాపు 40 సవరణలు ప్రతిపాదిస్తూ ఈ కొత్త బిల్లును తీసుకు రానుంది.

LokSabha: వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నోటీసులు

న్యూఢిల్లీ, ఆగస్ట్ 08: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ సవరణ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఆ క్రమంలో లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఎంపీ కేసీ వేణుగోపాల్ నోటీసులు ఇచ్చారు. అందులోభాగంగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తమ పార్టీ ఎంపీలతో సమావేశమై.. ఈ అంశంపై చర్చిస్తున్నారు.

Also Read:Bangladesh Violence: భారత్‌లోని బంగ్లాదేశీ విద్యార్థుల్లో ‘ఆందోళన’


ఇక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరికాసేపట్లో లోక్‌సభలో ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబిసి ముస్లింలు, షియా, బోహ్ర తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ చట్టానికి దాదాపు 40 సవరణలు ప్రతిపాదిస్తూ ఈ కొత్త బిల్లును తీసుకు రానుంది. దీంతో సరైన ఆధారాలు లేకుండానే ఆస్తులు తమవేనని ప్రకటించే వక్స్ బోర్డు ఏక పక్ష అధికారాలకు ఇకపై కత్తెర పడనుంది. అలాగే ఆస్తుల వేరిఫికేషన్ అధికారాలు ఇకపై జిల్లా కలెక్టర్లకు అప్పగించేలా నిబంధనలు రూపొందించారు.

Also Read: Vinesh Phogat: ‘నాపై కుస్తీ గెలిచింది.. నేను ఓడిపోయాను’

Also Read: Viral: గర్ల్ ఫ్రెండ్‌ కోసం.. ఓ టీనేజర్ ఘనకార్యం


ఈ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఆ విమర్శలను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తుంది. వక్ఫ్ బోర్డులలో పారదర్శకత, జవాబు దారితనం కోసమే ఈ కొత్త బిల్లు తీసుకు వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వివరిస్తుంది. గతంలోని వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తూ మరొక బిల్లును కేంద్రం తీసుకు రానుంది. అయితే ఈ వక్ఫ్ సవరణ బిల్లును పలు ముస్లిం సంఘాలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 08 , 2024 | 11:16 AM