Indian Railways: దేశవ్యాప్తంగా 69 రైళ్ల రద్దు, 107 దారి మళ్లింపు.. ఎందుకంటే
ABN , Publish Date - May 04 , 2024 | 07:54 AM
హర్యానా రాష్ట్రంలోని శంభు స్టేషన్ లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 69 రైళ్లను రద్దు(Trains Cancel) చేసింది. 107 రైళ్లను దారి మళ్లించింది.
ఢిల్లీ: హర్యానా రాష్ట్రంలోని శంభు స్టేషన్ లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 69 రైళ్లను రద్దు(Trains Cancel) చేసింది. 107 రైళ్లను దారి మళ్లించింది. 12 రైళ్ల ప్రయాణ సమయాలను మార్చింది.
ఉత్తర భారత రైల్వే ఓ ప్రకటనలో.. రద్దైన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను వెల్లడించింది. మే 3 నుంచి 8 వరకు రైళ్ల రద్దు కొనసాగుతుందని తెలిపింది. అంబాలా డివిజన్‌లోని సనేహ్వాల్ సెక్షన్‌లోని శంభు రైల్వే స్టేషన్‌లో రైతుల ఆందోళన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.
ఢిల్లీ సరాయ్ రోహిల్లా AC సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, జమ్మూ మెయిల్, షాన్-ఎ-పంజాబ్ ఎక్స్‌ప్రెస్, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. కొన్ని రైళ్లు గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఆందోళనలు జరుగుతున్న స్టేషన్ మీదుగా కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తారు. ఉదాహరణకు అంబాలా, లూథియానా మధ్య నేరుగా నడిచే రైళ్లు ఇప్పుడు అంబాలా నుండి చండీగఢ్‌కు వెళ్లి, ఆపై లూథియానాకు వెళ్తాయన్నమాట. రైల్వే శాఖ తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా రద్దైన రైళ్ల వివరాలు తెలుసుకోవాలని ప్రయాణికులను కోరింది.
For Latest News and National News click here