Rajya Sabha: రాజ్యాంగంపై చర్చ ప్రారంభించనున్న మంత్రి నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Dec 16 , 2024 | 11:03 AM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీతోపాటు పలు అంశాలపై చర్చించాలంటూ సభలో ప్రతిపక్షాలు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు డిమాండ్ చేశాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో సంవిధాన్ గౌరవ్ యాత్ర పేరిట రాజ్యసభలో నేడు, రేపు.. అంటే సోమ, మంగళవారాల్లో రాజ్యాంగ దినోత్సవంపై ప్రత్యేక చర్చ కొనసాగనుంది. సభలో ఈ చర్చను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. ఇదే సభలో ఈ అంశంపై బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. రాజ్యాంగంపై మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసగించనున్నారు.
Also Read: యథావిధిగా కొనసాగనున్న పాపికొండల యాత్ర
మరోవైపు భారత రాజ్యాంగంపై శనివారం లోక్‍సభలో జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం ఆ పార్టీ రక్తం రుచి చూసిందన్నారు. రాజ్యాంగాన్ని పదేపదే ఛిద్రం చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. రాజ్యాంగ దార్శనికతకు అనుగుణంగా భారత్ బలంతోపాటు ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకొని.. 2014 నాటి నుంచి తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆదివారం స్పందించింది. ఆ క్రమంలో ప్రధానిపై ఆ పార్టీ విరుచుకుపడింది.
Also Read: రాజ్యసభ సభ్యులుగా నేడు ప్రమాణ స్వీకారం
Also Read: తుపాన్‍తో చిగురుటాకులా వణుకుతోన్న ‘మయోట్’
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీతోపాటు పలు అంశాలపై చర్చించాలని ఈ సందర్భంగా సభలో ప్రతిపక్షాలైన ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు సభలో అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు నిరసన బాట పట్టాయి. ఆ క్రమంలో ఇరు సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో పార్లమెంట్‍లో భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతోంది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20వ తేదీతో ముగియనున్నాయి.
మరోవైపు జమిలి ఎన్నికల బిల్లు తొలుత ఈ రోజే ఆమోదించుకోవాలని మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కానీ చివరి నిమిషంలో కాస్తా వెనుకకు తగ్గింది. ముందుగా ఆర్థిక కార్యకపాలకు సంబంధించిన బిల్లును ఆమోద ముద్ర వేయించుకోవాలని నిర్ణయించింది. అనంతరం.. అంటే ఈ వారంలోనే జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించుకొనేందుకు మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుకోసం ముందుగా బిల్లుల ఆమోదం జాబితాలో ఉంచి.. చివరి నిమిషంలో వాటిని ఆ జాబితా నుంచి తొలగించారు.
ఇంకోపైపు జమిలి ఎన్నికల బిల్లు ఆమోదంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లు ఆమోదం పొందితే మాత్రం దేశంలో ఒకే సారి ఎన్నికలు జరిగే అవకాశాముంది. సార్వత్రిక ఎన్నికలతోపాటు అన్ని రాష్ట్రాలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అదీకాక.. ప్రతి ఏడాది దేశంలో ఎప్పుడో అప్పుడు.. ఎక్కడో అక్కడ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.
దీని వల్ల భారీగా వ్యయం జరగడం, అధికారులు సైతం అధిక సమయాన్ని వినియోగించాల్సి వస్తోంది. అలాగే సంక్షేమ పథకాల అమలుకు సైతం ఎన్నికల కోడ్ పేరుతో అమలు చేసే పరిస్థితి లేకుంది. ఇటువంటి వేళ.. ఒకే దేశం ఒకే ఎన్నికల నినాదాన్ని అమల్లోకి తీసుకు రావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
For National News And Telugu News