PM Modi: మహిళలకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ బీమా సఖి యోజన పథకాన్ని ప్రారంభించిన మోదీ
ABN , Publish Date - Dec 09 , 2024 | 05:19 PM
డిసెంబర్ 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఒక ప్రత్యేకత కూడా ఉందని, భారతీయ గ్రంథాలు తొమ్మిదో సంఖ్యను అత్యంత శుభప్రదంగా భావిస్తాయని, 9వ సంఖ్య దుర్గామాత శక్తికి తార్కాణమని, సాధికారత, శక్తికి సంకేతమని ప్రధాని మోదీ చెప్పారు.
న్యూఢిల్లీ: మహిళా సాధికారత దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరో కీలక పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. బీమా సఖి యోజన (Bima Sakhi Yojana) అనే పథకాన్ని హర్యానాలోని పానిపట్‌లో జరిగిన సోమవారంనాడు జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఈ పథకం ద్వారా ఉపాధి లభించనుంది. 18 నుంచి 70 ఏళ్ల లోపు మహిళలు ఈ పథకం ద్వారా ఎల్‌ఐసీ ఏజెంట్లుగా ఉపాధి పొందుతారు. మహిళలలో అక్షరాస్యతా పెంపు, ఆర్థికంగా బలపడేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాది, ఉద్యోగావకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయం ఉండేలా చూడటం పథకం ముఖ్యోద్దేశం.
Maharashtra: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఫడ్నవిస్ సర్కార్
మహిళా ప్రగతికి అవరోధమైన సామాజిక ఇబ్బందులను తొలగించడం ప్రధానోద్దేశంగా ఈ పథకం రూపొందినట్టు ప్రధాని తన ప్రసంగంలో తెలిపారు ''గతంలో కొన్ని పనులను మహిళలకు అప్పగించే విషయంలో ఆటంకాలు ఎదురయ్యేవి. మన ఆడకూతుళ్లకు అలాంటి అవరోధాలను తొలగించాలని బీజేపీ నిర్ణయించింది. ప్రతి రంగంలోనూ మహిళలు రాణించేలా చేసేందుకు కట్టుబడి ఉన్నాం. లింగ సమానత్వం, వివిధ రంగాల్లో మహిళా సాధికారతను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చాం'' అని చెప్పారు. డిసెంబర్ 9వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఒక ప్రత్యేకత కూడా ఉందని, భారతీయ గ్రంథాలు తొమ్మిదో సంఖ్యను అత్యంత శుభప్రదంగా భావిస్తాయని, 9వ సంఖ్య దుర్గామాత శక్తికి తార్కాణమని, సాధికారత, శక్తికి సంకేతమని చెప్పారు. డిసెంబర్ 9వ తేదీనాడే రాజ్యాంగ సభ తొలి సమావేశం జరిగిందని చెప్పారు.
ఏక్ హై తో సేఫ్ హై
'ఏక్ హై తో సేఫ్ హై' నినాదాన్ని అక్కున చేర్చుకున్న హర్యానా రాష్ట్రాన్ని మోదీ అభినందించారు. ఐక్యత, భద్రత అనేవి యావద్దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. భగవద్గీతను ప్రబోధించిన కురక్షేత్రలో అంతర్జాతీయ గీతా మహోత్సవ్ జరుగుతున్న తరుణంలో మహిళా సాధికారతకు దోహత పడే ఎల్ఐసీ బీమా సఖి యోజన పథకం ప్రారంభం కావడం మరో విశేషమని చెప్పారు. ఎల్ఐసీ బీమా యోజన పథకం కింద కనీసం 10వ తరగతి చదివిన మహిళలలకు మూడేళ్ల శిక్షణ ఇస్తారు. అనంతరం ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమిస్తారు. శిక్షణా కాలంలో స్టయిఫండ్, పాలసీ అమ్మకాల ఆధారంగా కమిషన్ ఇస్తారు.
ఇవి కూడా చదవండి..