PM Modi: నా డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేశా!
ABN , Publish Date - May 07 , 2024 | 05:51 AM
ప్రధాని మోదీ డ్యాన్స్ చేస్తున్నట్టున్న ఓ యానిమేటెడ్ వీడియా ఆకట్టుకుంటుండగా.. దానిపై మోదీ కూడా స్పందించారు. ‘కాన్సెర్ట్ మీమ్ టెంప్లెట్’ ఆధారంగా రూపొందించిన ఈ వీడియోను కృష్ణ అనే వ్యక్తి ‘ఎక్స్’లో పోస్టు చేశారు.

న్యూఢిల్లీ, మే 6: ప్రధాని మోదీ డ్యాన్స్ చేస్తున్నట్టున్న ఓ యానిమేటెడ్ వీడియా ఆకట్టుకుంటుండగా.. దానిపై మోదీ కూడా స్పందించారు. ‘కాన్సెర్ట్ మీమ్ టెంప్లెట్’ ఆధారంగా రూపొందించిన ఈ వీడియోను కృష్ణ అనే వ్యక్తి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘డిక్టేటర్’ తనను అరెస్టు చేయించరని తెలుసు కాబట్టే ఈ వీడియో పోస్టు చేస్తున్నానని వ్యాఖ్య జోడించాడు. దీనికి మోదీ స్పందిస్తూ ‘నా డ్యాన్స్ చూసి నేను కూడా మీ అందరిలాగే సంతోషించాను. ఎన్నికల వేళ ఇలాంటి సృజనాత్మకత నిజంగా ఉత్సాహాన్నిస్తుంద’ని పేర్కొన్నారు. దీంతో ‘అసలు వ్యక్తి’ కూడా స్పందించారంటూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు.