Share News

Rahul Gandhi: వరద బాధితులకు ఆర్థిక సాయం

ABN , Publish Date - Sep 04 , 2024 | 06:00 PM

కొండ చరియలు భారీగా విరిగి పడడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు కారణం జరిగిన నష్టం నుంచి జిల్లా వాసులు కోలుకోనేందుకు మన సహాయ సహకారాలు కావాలన్నారు.

Rahul Gandhi: వరద బాధితులకు ఆర్థిక సాయం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 04: ప్రకృతి ప్రకోపానికి గురైన వయనాడ్ జిల్లా వాసులకు ప్రతి ఒక్కరు అండ దండ.. గా నిలవాలని భారతీయ సమాజానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. భారీ వర్షాలు, వరదలతోపాటు కొండ చరియలు విరిగిపడ్డడంతో.. వయనాడ్ జిల్లా వాసుల పునరావాసం కోసం ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని ప్రజలకు ఆయన విజ్జప్తి చేశారు. ఆ క్రమంలో తన ఒక నెల జీతాన్ని విరాళంగా అందజేస్తున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా బుధవారం స్పందించారు.

Also Read: Vinayaka Chavithi Special 2024: ఇంతకీ పండగ శుక్రవారమా? లేక శనివారమా?.. పండితులు ఏం చెబుతున్నారంటే?..


కొండ చరియలు భారీగా విరిగి పడడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు కారణం జరిగిన నష్టం నుంచి జిల్లా వాసులు కోలుకోనేందుకు మన సహాయ సహకారాలు కావాలన్నారు. విపత్తు సంభవించిన ప్రాంతాల్లో పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా దేశ ప్రజలకు సూచించారు.

Also Read: Vinayaka Chavithi Special 2024: పండగ రోజు విద్యార్థులు ఇలా చేస్తే మాత్రం వారికి తిరుగే ఉండదు..


స్టాండ్ విత్ వయనాడ్.. ఐఎన్‌సీ యాప్‌‌ను కేరళలోని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందన్నారు. ఈ యాప్ ద్వారా విరాళాలు అందజేయ వచ్చన్నారు. వయనాడ్‌లో విపత్తు చోటు చేసుకున్న ప్రాంతాల పునర్నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు తొమ్మిది మంది సభ్యులతో ఓ కమిటీని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసింది.

Also Read: Vinayaka Chavithi Special 2024: ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి. ఏ మంత్రం చదివి పూజించాలంటే..


జులై 30వ తేదీన వయనాడ్‌ జిల్లాలో ముప్పిడి పంచాయతీ పరిధిలోని పంచిరిమట్టం, చూరల్మలతోపాటు ముండక్కై గ్రామాల్లో భారీ వర్షాలు, వరదలు కారణంగా.. పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 200 మందికి పైగా మరణించారు. 78 మంది గల్లంతయ్యారు. ఈ ఘటన జరిగి నెల రోజులు దాటినా వారి జాడ నేటికి తెలియరాలేదు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పర్యటించారు. అలాగే ప్రధాని మోదీ సైతం ఇటీవల వయనాడ్ జిల్లాలోని విపత్తు సంభవించిన ప్రాంతంలో పర్యటించారు.

Also Read: YS Sahrmila: బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి


ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ గెలుపొందారు. ఇదే ఎన్నికల్లో రాయబరేలి నుంచి ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. దాంతో వయనాడ్‌ లోక్ సభ సభ్యత్వానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు త్వరలో నగారా మోగనుంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ బరిలో దిగనున్నారనే ఓ ప్రచారం సైతం సాగుతుంది.

Updated Date - Sep 05 , 2024 | 08:59 PM