Share News

Rahul Gandhi: ఓం బిర్లాను కలిసిన రాహుల్... అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి

ABN , Publish Date - Dec 11 , 2024 | 03:37 PM

పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలని తాము కోరుకుంటున్నామని, డిసెంబర్ 13న రాజ్యాంగంపై చర్చ జరగాలని రాహుల్ గాంధీ అన్నారు.

Rahul Gandhi: ఓం బిర్లాను కలిసిన రాహుల్... అవమానకర వ్యాఖ్యలు తొలగించాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla)ను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కోరారు. ఓం బిర్లాతో బుధవారంనాడు సమావేశమైన అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడారు.

Manish Sisodia: మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ఊరట


''నేను స్పీకర్‌తో సమావేశమయ్యాను. నాపై చేసిన అవమానకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసాను. ఆ విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సభ సజావుగా జరగాలన్నదే మా లక్ష్యం. చర్చ జరగాలి. బీజేపీ నాయకులు నాకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పనీయండి...డిసెంబర్ 13న రాజ్యాంగ చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. వాళ్లు అదానీపై చర్చను కోరకోవడం లేదు.. ఆ విషయాన్ని మేము విడిచిపెట్టం. వాళ్లు మాపై ఆరోపణలు చేసుకోనీయండి, కానీ సభ మాత్రం జరగాలి'' అని రాహుల్ అన్నారు.


బీజేపీ లోక్‌సభ ఎంపీలు నిషికాంత్ డూబే, సంబిత్ పాత్ర డిసెంబర్ 5న సభలో మాట్లాడుతూ, రాహుల్‌గాందీకి, హంగేరియన్‌కు మధ్య సంబంధాలున్నాయని ఆరోపించారు. ఆ మరుసటి రోజు, సోరోస్, గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ నెట్ వర్క్ ఓసీసీఆర్‌పీ అంశాన్ని డూబే లేవనెత్తారు. ఓసీసీఆర్‌పీతో కాంగ్రెస్‌కు సంబంధాలున్నాయని, రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' కోసం జార్జి సోరెస్‌ నుంచి నిధులు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో సభ వాయిదా పడింది. ఆ తర్వాత సభ సమావేశమైనప్పుడు డూబే, సంబిత్ పాత్రపై తాము ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుల పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ సభ్యలు నిలదీశారు.


'ద్రోహి' వ్యాఖ్యలపై ప్రియాంక ఫైర్

కాగా, రాహుల్ గాంధీని 'ద్రోహి' అంటూ సంబిత్ పాత్ర సంబోధించడాన్ని ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాందీ, రాజీవ్‌గాంధీలను సైతం ద్రోహులుగా మాట్లాడిన వ్యక్తులు రాహుల్ గాంధీని విడిచిపెడతారని తాము అనుకోలేమని, వాళ్లకు ఇదేమీ కొత్త కాదని అన్నారు. రాహుల్ గాంధీకి అన్నింటికంటే దేశమే ఎక్కువని, ఆయనను చూసి తాను గర్విస్తున్నానని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..

CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్‌..

For National news And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 03:37 PM