Share News

Salman Khan: సల్మాన్‌కు బెదిరింపులు, నొయిడా యువకుడి అరెస్టు

ABN , Publish Date - Oct 29 , 2024 | 03:36 PM

పోలీసుల కథనం ప్రకారం, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ ఇటీవల హత్యకు గురైన క్రమంలో ఆయన కుమారుడు జీశాన్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాలర్ పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు.

Salman Khan: సల్మాన్‌కు బెదిరింపులు, నొయిడా యువకుడి అరెస్టు

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్ (Salman Khan)ను, ఎమ్మెల్యే జీశాన్ సిద్దిఖీని చంపుతామంటూ బెదిరింపుల్ ఫోన్ కాల్ చేసిన కేసుకు సంబంధించి తాజాగా ఒక అరెస్టు చోటుచేసుకుంది. నొయిడా ప్రాంతంలో 20 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అతనిని ట్రాన్సిట్ రిమాండ్‌కు పంపారు.

PM Modi: అయోధ్య ఆలయంలో దీపావళి.. 500 ఏళ్లలో ఇదే తొలిసారి


పోలీసుల కథనం ప్రకారం, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ ఇటీవల హత్యకు గురైన క్రమంలో ఆయన కుమారుడు జీశాన్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాలర్ పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకుంటే జీశాన్‌తో పాటు సల్మాన్‌ ఖాన్‌ను కూడా చంపేస్తామని బెదిరించాడు. జీశాన్ కార్యాలయ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. మొహమ్మద్ తయ్యబ్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్టు నిర్దారణ కావడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.


బాబా సిద్ధిఖీ హత్య ఈనెల మొదట్లో ముంబైలో తీవ్ర సంచలనం సృష్టించింది. సల్మాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆయనను ముగ్గురు దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య తమ పనేనంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాబా సిద్ధిఖీ హత్య కేసులో పట్టుబడిన షూటర్లు పోలీసు విచారణలో జీశాన్‌ను చంపేందుకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చినట్టు వెల్లడించడం మరింత కలకలం సృష్టించింది.


ఇవి కూడా చదవండి..

కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు

ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 29 , 2024 | 04:18 PM