Kolkata Doctor: ఆధారాలు దొరకొద్దనే ధ్వంసం చేశారు..!
ABN , Publish Date - Aug 19 , 2024 | 04:20 PM
కోల్‌కతా వైద్యురాలి మృతిపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైద్య సంఘాలు ఆందోళనకు దిగాయి. వీలైనంత త్వరగా నిందితుడికి ఉరి శిక్ష విధించాలని కోరుతున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ చేసి, దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని ధ్వంసం చేశారు
కోల్ కతా: కోల్ కతా వైద్యురాలి మృతిపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వైద్య సంఘాలు ఆందోళనకు దిగాయి. వీలైనంత త్వరగా నిందితుడికి ఉరి శిక్ష విధించాలని కోరుతున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ చేసి, దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని ధ్వంసం చేశారు. ఆ ఘటనపై మృతురాలి న్యాయవాది (Kolkata Lawyer) బికాష్ రంజన్ భట్టాచార్య స్పందించారు.
టీఎంసీకి నచ్చడం లేదు
‘ వైద్యురాలిపై రేప్, హత్య కేసును నిరసిస్తూ జరుగుతోన్న ఆందోళనలు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం నచ్చడం లేదు. ఆందోళనలు, నిరసనలు జరగకుండా చూడాలని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. ఆ క్రమంలో ఆర్జీ కర్ ఆస్పత్రి మెడికల్ హాల్‌ను టీఎంసీ గుండాలు ధ్వంసం చేశారు. వైద్యురాలిపై లైంగికదాడికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉండొచ్చనే ఉద్దేశంతో దాడి చేశారు. ఆధారాలను ధ్వంసం చేయడమే వారి ప్రధాన ఉద్దేశం అని’ లాయర్ బికాస్ రంజన్ స్పష్టం చేశారు.
37 మంది అరెస్ట్
ఆర్జీ కర్ ఆస్పత్రిపై దాడి జరిగిన తర్వాత పోలీసులు 37 మందిని అరెస్ట్ చేశారు. అందులో అధికార టీఎంసీతోపాటు విపక్షాలకు చెందిన కార్యకర్తలు ఉన్నారు. దాడి జరిగిన వెంటనే ఇది విపక్షాల పని అని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సొంత పార్టీ కార్యకర్తల పాత్ర కూడా ఉందని పోలీసులు వివరించారు. దీంతో టీఎంసీ దాగుడు మూతలు ఆడుతుందని స్పష్టమైంది.
అనుమానాస్పదం..
‘వైద్యురాలి మృతిపై తొలి నుంచి సందేహాం ఉంది. ట్రైనీ డాక్టర్ అనారోగ్యంతో ఉందని చెప్పారు. అరగంట తర్వాత ఆత్మహత్య చేసుకుందని వివరించారు. ఆ వైద్యురాలిది ఆత్మహత్య లేదా హత్య అనేది అక్కడున్న వైద్యులకు తెలియదు. డాక్టర్ మృతిపై పోలీసులు శాస్త్రీయంగా విచారణ చేపట్టలేదు. మృతదేహానికి ఆగమేఘాల మీద అంత్యక్రియలు నిర్వహించారు. కీలకమైన సాక్ష్యాలను చెరిపివేయాలనే ఉద్దేశంతో నిర్వహించారు. కేసులో తమకు సందేహాలు పెరిగాయి అని’ లాయర్ బికాస్ రంజన్ తెలిపారు.
Also Read: Bengaluru Student: పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్న యువతిపై దారుణం..
Read More National News and Latest Telugu News