Share News

Supreme Court: అత్యాచార బాధితురాలి పిటిషన్.. గర్భవిచ్ఛిత్తిపై కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీం కోర్టు

ABN , Publish Date - Apr 22 , 2024 | 09:04 AM

అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సుప్రీం కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.

 Supreme Court: అత్యాచార బాధితురాలి పిటిషన్.. గర్భవిచ్ఛిత్తిపై కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీం కోర్టు

ఢిల్లీ: అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సుప్రీం కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. గతంలోనే కోర్టు గర్భవిచ్ఛితికి అనుమతించే అంశంపై గతంలోనే వైద్యుల సలహా కోరింది.


ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి సోమవారంలోగా నివేదిక అందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా ధర్మాసనం ఏప్రిల్ 19న ఆదేశించింది. సుప్రీంకోర్టు(Supreme Court) జోక్యాన్ని కోరుతూ బాలిక పంపిన ఈమెయిల్‌ సందేశంపై స్పందించిన ధర్మాసనం సాయంత్రం 4.30 గంటలకు సమావేశం నిర్వహించింది.


ఈ దశలో గర్భం తొలగిస్తే బాలికపై శారీరకంగా, మానసికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పాలని ముంబై(Mumbai)లోని సియోన్ ఆసుపత్రిని కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సూచించింది. తదుపరి విచారణ ఇవాళ చేపట్టబోతోంది. వైద్యులు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ఆధారంగా కోర్టు విచారణ సాగనుంది.


Viral Video: లైవ్‌లో వార్తలు చదువుతూ స్పృహ తప్పిన దూరదర్శన్ యాంకర్.. ఎంతకీ కళ్లు తెరవకపోవడంతో

అత్యాచారానికి గురైన బాలిక 28 వారాల గర్భవిచ్ఛిత్తిని తొలగించాలని ఆమె తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు వారి పిటిషన్‌ని తిరస్కరించడంతో తల్లి సుప్రీం తలుపు తట్టింది. వైద్యపరంగా గర్భం తొలగించాలంటే పిండం వయసు గరిష్ఠంగా 24 వారాలకు మించరాదని మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం చెబుతోంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 22 , 2024 | 09:12 AM