Hatras stampede: భోలే బాబా సత్సంగం ముగింపులో తొక్కిసలాట...ఎవరీ బాబా?
ABN , Publish Date - Jul 02 , 2024 | 08:08 PM
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా రతీఖాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదాంతమైంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 107కు చేరింది. భోలో బాబాగా పిలుచుకునే నారాయణ సకార్ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
హత్రాస్: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ (Hatras) జిల్లా రతీఖాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదాంతమైంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Stampede)లో మృతుల సంఖ్య 107కు చేరింది. వీరిలో మహిళలు , పిల్లలే ఎక్కువగా ఉన్నారు. భోలో బాబా (Bhole Baba)గా పిలుచుకునే నారాయణ సకార్ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్‌లో సత్సంగం ఏర్పాటు చేయగా, సత్సంగం ముగుస్తుందనగా ఒకేసారి అందరూ బయటకు వచ్చే ప్రయత్నం చేయడం, సభా స్థలి చిన్నది కావడంతో పలువురికి ఊపిరి ఆడలేదని, కొందరు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇతమిద్ధమైన కారణంపై విచారణ జరుగుతోంది.
ఎవరీ భోలే బాబా?
ఎటా (Etah) జిల్లా పాటియాలి తహసల్‌కు చెందిన బహదూర్ గ్రామానికి చెందిన భోలే బాబా గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిగా పనిచేసినట్టు చెబుతారు. 26 ఏళ్ల క్రితమే ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మతపరమైన సత్యంగాలు ప్రారంభించారు. ఆయనకు వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. మోడ్రన్ బాబాల మాదిరిగా కాకుండా బోలో బాబా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటారు. సామాన్య ప్రజానీకంలో ఆయనకు విశేషమైన ఆదరణ ఉంది. బోలో బాబా సత్సంగ కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రతి మంగళవారం నిర్వహిస్తుంటారు. దీనికి వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు. భక్తులకు అవసరమైన ఆహార, నీటి వసతులను వలంటీర్లే స్వయంగా ఏర్పాటు చేస్తుంటారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలోనూ పలు ఆంక్షలున్నప్పటికీ బోలో బాబా ఆదరణ ఏమాత్రం తగ్గలేదని, గణనీయంగా భక్తులు వచ్చే వారని వలంటీర్లు చెబుతున్నారు.
PM Modi: పేపర్ లీకేజీ నిందితులను వదిలిపెట్టం: ప్రధాని మోదీ
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
హత్రాస్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 100 మందికి పైగా మృతి చెందిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Read Latest National News and Telugu News