Share News

NTR Bharosa Pensions Distribution Live Updates: ఏపీలో పెన్షన్ల పండుగ..ఆనందంలో పెన్షన్ దారులు

ABN , First Publish Date - Jul 01 , 2024 | 06:24 AM

అవును.. సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు..! పెన్షన్ల విషయంలో సీబీఎన్ ఇచ్చిన హామీని అక్షరాలా నెరవేరింది. మంగళగిరిలోని పెనుమాక గ్రామంలో చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. తొలి పెన్షన్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండగ మొదలైంది. పెన్షన్ల పంపిణీ ఏపీలో ఎలా జరుగుతోంది..? పంపిణీ కార్యక్రమంలో ఎవరేం మాట్లాడరన్న విషయాలు ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి..

NTR Bharosa Pensions Distribution Live Updates: ఏపీలో పెన్షన్ల పండుగ..ఆనందంలో పెన్షన్ దారులు

Live News & Update

  • 2024-07-01T13:45:16+05:30

    కాళ్లు కడిగి.. పింఛన్లు ఇచ్చిన మంత్రి!

    • పింఛన్‌ లబ్ధిదారుల కాళ్లు కడిగిన మంత్రి నిమ్మల రామానాయుడు

    • పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఘటన

    • దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు..

    • పెరిగిన సొమ్ముతో కలిపి పింఛన్లు అందజేసిన మంత్రి నిమ్మల

    • పింఛన్ సొమ్మును ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసి.. లబ్ధిదారుల కాళ్లు కడిగిన మంత్రి

    Nimmala-Minister.jpg

  • 2024-07-01T13:30:37+05:30

    అనుకోలేదు ఏనాడు..!

    • పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ మనసులో మాట!

    • సీఎం, డిప్యూటీ సీఎం కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు

    • కష్టాలు వచ్చినప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉండాలనే అనుకున్నాను

    • పదవుల కోసం కాకుండా నాదేశం, నా నేల కోసం పనిచేస్తాను

    • నా వైపు ఎలాంటి అవినీతి ఉండదు..

    • ఓటు వేసినవారే కాదు.. వేయని వారు కూడా నన్ను ప్రశ్నించొచ్చు

    • తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తాను

    • హంగులు, ఆర్భాటాలకు నేను ఎప్పుడూ వెళ్లను

    • మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని..

    • ప్రజలు అనుకునేలా పాలన ఉంటుంది.. : పవన్ కల్యాణ్

    Pawan-On-Corruption.jpg

  • 2024-07-01T13:00:37+05:30

    జీతం తీసుకోను..!

    • పెన్షన్ల పంపిణి కార్యక్రమంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • తొలుత జీతం తీసుకొని పనిచేద్దాం అనుకున్నాను

    • అప్పులు చేసి ఎమ్మెల్యేగా జీతం తీసుకోవద్దని నిర్ణయించుకున్నా

    • వేల కోట్ల అప్పులు చూసి ఎమ్మెల్యేగా జీతం వద్దనుకున్నాను

    • పంచాయితీ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదు

    • క్యాంప్ ఆఫీసులో మరమ్మతులు ఏమైనా చేయాలా అని..

    • అధికారులు అడిగితే వద్దని చెప్పేశాను

    • కొత్త ఫర్నీచర్ కొనొద్దు.. నేను తెచ్చుకుంటానని చెప్పాను : పవన్ కల్యాణ్

    Pawan-On-Salary.jpg

  • 2024-07-01T12:30:27+05:30

    వలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగలేదే!

    • వలంటీర్ల వ్యవస్థపై మరోసారి డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • వలంటీర్లు లేకపోతే పెన్షన్ ఆగిలేదు కదా..?

    • నాడు వలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని ఊదరగొట్టారే..?

    • నేడు వలంటీర్లు లేరు.. పెన్షన్లు ఆగాయా..?

    • రెట్టింపు పెన్షన్‌ను కూడా సచివాలయ ఉద్యోగులు..

    • ఇళ్లకు వచ్చి మరీ ఇస్తున్నారు కదా..!

    • గతంలో పెన్షన్ల పంపిణీకి 4-5 రోజులు ఇచ్చేవారు

    • ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం లోగా 100 శాతం పెన్షన్లు ఇస్తాం

    • వలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలి..

    • అనేదానిపై ఆలోచిస్తున్నామన్న డిప్యూటీ సీఎం

    • పిఠాపురం పెన్షన్ల పంపిణీ సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

    Pawan-On-Volunteers.jpg

  • 2024-07-01T12:23:37+05:30

    నేనలా కాదు.. నేనే తెచ్చుకుంటా!

    • వైసీపీ ఫర్నీచర్ వాడుకోవడంపై డిప్యూటీ సీఎం పవన్ సెటైర్లు!

    • నా క్యాంప్ ఆఫీస్‌ ఫర్నిచర్ నేనే తెచ్చుకుంటా అని చెప్పా

    • మేం ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం

    • నా మంత్రిత్వ శాఖలపై అధ్యయనం చేస్తున్నా

    • బాధ్యతలు చేపట్టిన వెంటనే నేరుగా పనిలోకి వెళ్లాలనుకున్నా..

    • పంచాయతీరాజ్‌ శాఖ నిధులను వైసీపీ అడ్డగోలుగా మళ్లించింది..

    • రుషికొండలో విలాసవంతమైన భవనం అవసరమా?

    • రుషికొండలో కట్టిన డబ్బుతో ఎంతో అభివృద్ధి చేయొచ్చు

    • గోదావరి జిల్లాల్లో 80 శాతం చెరువులున్నా తాగడానికి నీళ్లు లేవు

    • జల్ జీవన్ మిషన్‌కు కేంద్రం నిధులు ఇస్తుంది..

    • కానీ గత వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు: పవన్‌

    Pawan-On-Furniture.jpg

  • 2024-07-01T12:16:38+05:30

    అవును.. నేనిందే.. ఇదే నా పాలసీ!

    • గొల్లప్రోలులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

    • పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్‌

    • లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన పవన్‌ కల్యాణ్‌

    • పెన్షన్లపై గత ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది..

    • మేం అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచి ఇచ్చాం..

    • ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తాం

    • సంక్షేమంతో పాటు అభివృద్ధి అవసరం

    • పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు..

    • శాఖలపై అధ్యయనానికి కొంత సమయం పట్టింది..

    • తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేస్తా

    • ప్రతి రెండు వారాలకోసారి పిఠాపురం వస్తా: పవన్‌

    PAwan-Neninthe.jpg

  • 2024-07-01T12:15:49+05:30

    శుభాకాంక్షలు..!

    • డాక్టర్స్‌ డే సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • కరోనా సమయంలో డాక్టర్ల సేవలు మరువలేనివి

    • కరోనా బారినపడి 1,600 మంది వైద్యులు మరణించారు

    • దురదృష్టవశాత్తు వైద్యులపై ఈమధ్య దాడులు పెరిగాయి

    • రోగుల పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి

    • వైద్యుల పట్ల రోగులు విశ్వాసం కలిగి ఉండాలి: పవన్‌

    Pawan-Kalyan-Pithapuram.jpg

  • 2024-07-01T12:08:32+05:30

    పెన్షన్ డబ్బులు ఎత్తుకెళ్లారు!

    • కడప జిల్లా ప్రొద్దుటూరులో షాకింగ్ ఘటన!

    • పట్టణంలోని ఏడవ సచివాలయం పరిధిలో పలువురికి అందని ఫించన్లు

    • ఫించన్ డబ్బులు గుర్తు తెలి యని వ్యక్తులు ఎత్తుకెళ్లారని చెబుతున్న సచివాలయ కార్యదర్శి

    • పింఛన్ పంపిణీ చేసేందుకు వెళ్తుండగా..

    • సృహ తప్పి కింద పడిపోయానని చెబుతున్న కార్యదర్శి మురళీమోహన్

    • పెన్షన్ డబ్బు నాలుగు లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని చెబుతున్న కార్యదర్శి

    • తనను 108 వాహనంలో ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారని చెబుతున్న మురళి

    • పింఛన్ డబ్బులు మాయం కావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు

    • ఘటన పై విచారణ చేస్తున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు

    • సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

    Proddatur.jpg

  • 2024-07-01T12:00:13+05:30

    దివ్యాంగుల్లో ఆనందం!

    • దివ్యాంగుల ఫించన్ 3 వేలు నుంచి 6 వేలకు పెంపుపై దివ్యాంగులు హర్షం

    • సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ..

    • విఎస్ కృష్ణ లైబ్రరీ ముందు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్న దివ్యాంగులు

    • కార్యక్రమంలో మాట్లాడిన డిజేబుల్డ్ రైట్స్ ఫోరమ్ నాయకుడు సురేష్ మీనన్

    • ఫించన్ల కోసమే 4 వేల 4 వందల కోట్ల రూపాయలు కేటాయించడం ఆనందంగా ఉంది

    • అలాగే దివ్యాంగులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు..

    • పరిష్కరించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం : సురేష్

  • 2024-07-01T11:45:34+05:30

    ఏపీలో ఆగిన పెన్షన్ల పంపిణీ

    • పెన్షన్ల పంపిణీలో సాంకేతిక లోపం

    • సర్వర్‌లో సాంకేతికలోపంతో ఆగిన పెన్షన్ల పంపిణీ

    • సర్వర్ లోపంపై ఆరా తీస్తున్న అధికారులు

    • టెక్నికల్ విభాగంలో ఇంకా ..

    • వైసీపీ ప్రభుత్వ హయంలో పనిచేసిన ఉద్యోగులు

    • మానవ తప్పిదమా?.. లేక సాంకేతికలోపమా?..

    • అనే అంశంపై ఆరా తీస్తున్న ప్రభుత్వం

    • సుమారు గంటన్నర నుంచి ఆగిన పెన్షన్ల పంపిణీ

    • పెన్షనర్ల ఐరిస్‌, థంబ్‌ పడకపోవడంతో ఆగిన పంపిణీ

    nede-pensions-fest.gif

  • 2024-07-01T10:45:35+05:30

    పెన్షన్ పంపిణీలో పవన్!

    • పిఠాపురం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ

    • కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • కాసేపట్లో పవన్ చేతుల మీదుగా పెన్షన్ తీసుకోనున్న లబ్ధిదారులు

    Pawan-Kalyan-Pension.jpg

  • 2024-07-01T10:15:43+05:30

    ఘన స్వాగతం..!

    • సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

    • గాజువాక నియోజకవర్గం 67వ వార్డు హైస్కూల్ రోడ్‌లో పింఛన్లు అందజేసిన పల్లా

    • ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో వెయ్యి రూపాయలు పెంచుతామని ఇచ్చిన హామీ నెరవేర్చాం

    • ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వేయి రూపాయలతో పాటు 3000 వేలు కలిపి 4000 ఇస్తున్నాం

    • గడిచిన మూడు నెలలు 3000, ఈనెల 4000తో కలిపి మొత్తం 7000 లబ్ధిదారులకు అందజేస్తున్నాం

    • ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ ఆనందంతో స్వాగతం పలుకుతున్నారు

    • సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకమైన ధన్యవాదాలు

    • మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ అమలు చేస్తాం : పల్లా శ్రీనివాస్

    palla-srinivas-rao.jpg

  • 2024-07-01T09:30:25+05:30

    పెన్షన్ ఇవ్వడంలో కక్కుర్తి..!

    • ఆంధ్రప్రదేశ్‌లో పండగలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

    • పల్నాడు జిల్లా మాచర్లలో పింఛన్ దారుల వద్ద సచివాలయ ఉద్యోగి చేతివాటం

    • పెన్షన్లు తీసుకునే వారి వద్ద నుంచి 500 రూపాయలు కమిషన్ తీసుకున్న వాలు నాయక్ .

    • మాచర్ల-09వ వార్డు సచివాలయం వార్డులో ఘటన

    • వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ముదావత్ వాలు నాయక్

    • విషయం తెలుసుకుని వెంటనే వాలు నాయక్‌ను సస్పెండ్ చేసిన మున్సిపల్ కమిషనర్

    AP-Pensions-Andhra.jpg

  • 2024-07-01T09:20:43+05:30

    ఏపీలో పాలన మారింది..!

    • ప్రజలు మారారు.. పాలన మారింది!

    • సీఎం చంద్రబాబు పాల్గొన్నప్పటికీ ఎటువంటి హంగామా లేకుండా ప్రజా వేదిక ఏర్పాటు

    • ప్రజలకు.. నాయకులకు మధ్య పెరిగిన దగ్గర సంబంధాలు

    • వేదిక ముందు డి-సర్కిల్ సైతం ఎత్తివేత

    • ఆర్భాటాలు లేకుండా వేదిక సాదాసీదాగా ఏర్పాటు

    • ఇదే సభావేదికగా కీలక ప్రసంగం చేసిన సీబీఎన్

    • గత ప్రభుత్వ పాలనపై విమర్శనాస్త్రాలు

    Chandrababu-Praja-Vedika.jpg

  • 2024-07-01T09:15:22+05:30

    ఇక డిప్యూటీ సీఎం వంతు..!

    • పెనుమాకలో స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

    • తొలి పెన్షన్ పంపిణీ తర్వాత ఏపీ వ్యాప్తంగా ప్రారంభం

    • రాజమండ్రి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

    • గొల్లప్రోలులో పెన్షన్లు పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం

    Pawan-Kalyan.jpg

  • 2024-07-01T09:00:45+05:30

    సమస్యలు చెప్పిన లోకేష్.. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

    • లోకేష్ చెప్పిన మంగళగిరి సమస్యలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

    • 1995 తరహాలో సీఎం 4.0 చంద్రబాబును ఇక ప్రజలు చూస్తారు

    • రాజధానిలో భాగమైన మంగళగిరిలో అభివృద్ధిని పరుగులెత్తిస్తాం

    • గతంలో సీడ్ యాక్సిస్ రహదారి విస్తరణకు పెనుమాక ప్రజలు సహకరించలేదు

    • ఈసారి ఎవ్వరూ అడ్డుపడకుండా రహదారి పూర్తికి అంతా సహకరిస్తారని ఆశిస్తున్నా : నారా చంద్రబాబు

    Lokesh-And-Chandrababu.jpg

    లోకేష్ ఏం చెప్పారు..?

    • ప్రజా సంక్షేమం మంగళగిరిలో శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్న లోకేష్

    • మంగళగిరి ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలని సీఎంకు నివేదించిన మంత్రి

    • సీడ్ యాక్సిస్ రహదారి పూర్తి, అమరావతి నిర్మాణంలోనూ మంగళగిరి ప్రజలు ప్రభుత్వం వెన్నంటే ఉంటారు

    • మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత..

    • నాపై ఉన్నందున అందుకు సహకరించాలని సీఎంను కోరుతున్నా

    • గత అయిదేళ్ళు పరదాల ముఖ్యమంత్రిని చూశాం

    • ప్రజా ముఖ్యమంత్రిని ఇప్పుడు చూస్తున్నాం

    • అధికారులు మారటానికి కొంచెం టైమ్ పట్టినా, త్వరలోనే సెట్ అవుతారు : నారా లోకేష్

  • 2024-07-01T08:30:14+05:30

    సీఎంకు లోకేష్ వినతులు!

    • ప్రజావేదిక నుంచి మాట్లాడిన ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్

    • ప్రజా సంక్షేమం మంగళగిరిలో శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది

    • మంగళగిరి ప్రజా సమస్యలు త్వరగా పరీష్కరించాలని సీఎం చంద్రబాబుకు నివేదించిన లోకేష్

    • సీడ్ యాక్సిస్ రహదారి పూర్తి, అమరావతి నిర్మాణంలోనూ మంగళగిరి ప్రజలు ప్రభుత్వం వెన్నంటే ఉంటారు

    • మంగళగిరి నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత..

    • నాపై ఉన్నందున అందుకు సహకరించాలని సీఎంను కోరుతున్నా

    • గత అయిదేళ్ళు పరదాల ముఖ్యమంత్రిని చూశాం

    • ప్రజా ముఖ్యమంత్రిని ఇప్పుడు చూస్తున్నాం

    • అధికారులు మారటానికి కొంచెం టైమ్ పట్టినా, త్వరలోనే సెట్ అవుతారు : నారా లోకేష్

    Nara-Lokesh-On-Chandrababu.jpg

  • 2024-07-01T07:55:27+05:30

    ప్రజా వేదిక నుంచి సీబీఎన్ శుభవార్త..

    • పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు

    • ఈ వేదికగా ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన సీఎం నారా చంద్రబాబు

    • పేదలపైనే శ్రద్ధ పెట్టి.. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం

    • నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేస్తాం

    • ఎన్టీఆర్ భరోసా సామాజిక ఫించన్ ద్వారా ఒక మంచి కార్యక్రమం..

    • అమలు చేసే అవకాశం భగవంతుడు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నా

    • ఒకే రోజు పేదల కోసం రూ.4408 కోట్లు ఖర్చు చేసి చరిత్ర సృష్టించటం ఎంతో తృప్తినిస్తోంది

    • ఫింఛన్ల పంపిణీ మొదటి అడుగు మాత్రమే

    • ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావటమే మా లక్ష్యం

    • ఆర్థిక అసమానతలు తగ్గించి పేదరికం లేని సమాజ స్థాపనే ఏకైక లక్ష్యం

    • పేదరికం లేని సమాజం స్థాపనకు దేవుడు ఎంత శక్తినిస్తే అంత శక్తికొలదీ పనిచేస్తా

    • రాష్ట్రంలో ఎంత అప్పు ఉందో కూడా మా అధికారులు ఇంకా పూర్తి లెక్కలు తీయలేదు

    • తవ్వే కొద్దీ గత ప్రభుత్వ తప్పులు, అప్పులే బయటపడుతున్నాయి

    • ఫింఛన్లకు అదనంగా ఏటా 34వేల కోట్లు ఖర్చు చేస్తూ..

    • 5ఏళ్లలో లక్ష 20వేల కోట్ల పైగా ఫింఛన్లకు ఖర్చు చేయనున్నాం

    • దగా, మోసంతో ఐదేళ్లపాటు ప్రజకు అబద్ధాలు వింటూ బతికారు

    • వాస్తవాలను ప్రజలకు చెప్పి అబద్ధాలకోరులను భూస్థాపితం చేస్తాం

    • ప్రజలకు మేం సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా కాదు

    • మాకు ప్రజలు బాధ్యత ఇచ్చారు.. అధికారం కాదు

    • ఒకేరోజు 183 అన్న క్యాంటీన్లు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తాం : నారా చంద్రబాబు

    CBN-Good-News.jpg

  • 2024-07-01T07:45:10+05:30

    ఇదొక చరిత్ర..!

    • ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

    • సామాజిక పెన్షన్ల పంపిణీ ఒక చరిత్ర

    • రాష్ట్రంలో 65.31 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ

    • పెన్షన్ల కోసం ఏటా రూ.33,100 కోట్లు అవుతుంది

    • ఐదేళ్లలో పెన్షన్ల పంపిణీ కోసం రూ.1.65 లక్షల కోట్లు

    • బాధితులను ఆదుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

    • పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా ఆశయం

    • ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం

    • ప్రజల జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడింది

    • సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్‌ చెప్పారు

    • ఎన్టీఆర్‌ స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది

    • పేదలపై శ్రద్ధ పెడతాం.. అనునిత్యం అండగా ఉంటాం

    • ఆర్థిక అసమానతలు లేకుండా చేస్తాం

    • రాష్ట్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదు

    • వ్యవస్థలను గాడిలో పెట్టాలి: సీఎం చంద్రబాబు

    Chandrababu-Praja-Vedika.jpg

  • 2024-07-01T07:30:15+05:30

    ఐదేళ్లు పీడకల!

    • వైఎస్ జగన్ పాలనపై ‘చంద్ర’నిప్పులు!

    • ప్రజావేదిక.. వేదికగా గత వైసీపీ సర్కార్‌ చంద్రబాబు తీవ్ర విమర్శలు

    • గడిచిన ఐదేళ్లు రాష్ట్రానికి ఒక పీడకల

    • వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలను అణగదొక్కారు

    • ఏ రోజు ఎలా గడుస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు

    • వైసీపీ ప్రభుత్వం మన రాష్ట్రం బ్రాండ్‌ను దెబ్బతీసింది

    • పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు

    • ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే

    • గడిచిన ఎన్నికలు చరిత్రాత్మకమైనవి

    • ఇలాంటి ఎన్నికల ఫలితాలను ఎప్పుడూ చూడలేదు

    • నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందనే ఆనందంలో ప్రజలు ఉన్నారు..

    • అందరికీ న్యాయం జరగాలన్నదే నా లక్ష్యం: చంద్రబాబు

    Chandrababu-Prajavedhika.jpg

  • 2024-07-01T07:15:23+05:30

    ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ..

    • పెనుమాకలో తొలి పింఛన్ ఇచ్చిన సీఎం చంద్రబాబు

    • అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పింఛన్లు పంపిణీ ప్రారంభం

    • వేకువజాము నుంచే పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణి

    • ఇళ్లకెళ్లి పింఛన్లు పంపిణీ చేయడంతో ఆనందంలో పింఛన్ల లబ్దిదారులు

    Chandrababu-Penisons2.jpg

  • 2024-07-01T07:10:37+05:30

    చరిత్రాత్మకమైనవి.. ఎప్పుడూ చూడలేదు!

    • పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రజావేదికలో సీఎం చంద్రబాబు

    • చంద్రబాబు కీలక ప్రసంగం.. భారీగా హాజరైన జనం

    • అందరి ఆశీస్సులతో నాలుగోసారి సీఎం అయ్యాను

    • మీ అందరి అభిమానంతో లోకేష్‌ ఇక్కడ గెలిచారు

    • గాజువాక, భీమిలిలో మంచి మెజారిటీతో గెలిపించారు

    • మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీతో గెలిపించారు

    • ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే

    • గడిచిన ఎన్నికలు చరిత్రాత్మకమైనవి

    • ఇలాంటి ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ చూడలేదు

    • గడిచిన ఐదేళ్లు రాష్ట్రానికి ఒక పీడకల

    • వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలను అణగదొక్కారు

    • ఏరోజు ఎలా గడుస్తుందో చెప్పలేని పరిస్థితి

    • మన రాష్ట్రం బ్రాండ్‌ను దెబ్బతీశారు

    • అందరికీ న్యాయం జరగాలన్నదే నా లక్ష్యం

    • రాష్ట్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయో తెలియదు

    • వ్యవస్థలను గాడిలో పెట్టాలి: సీఎం చంద్రబాబు

    Chandrababu-Praja-Vedika.jpg

  • 2024-07-01T07:06:11+05:30

    మాటిస్తున్నా.. నెరవేరుస్తా..!

    • ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు పంపిణీ

    • పెనుమాకలో పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

    • ఎస్టీ కాలనీలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ

    • సీఎం చంద్రబాబు వెంట లోకేష్‌, టీడీపీ నేతలు

    • పాముల నాయక్‌ కుటుంబానికి పెన్షన్‌ అందజేసిన చంద్రబాబు

    • పాముల నాయక్‌కు వృద్ధాప్య పెన్షన్‌ అందజేసిన సీఎం

    • నాయక్‌ కుమార్తెకు వితంతు పెన్షన్‌ అందజేసిన చంద్రబాబు

    • అరగంటపాటు లబ్ధిదారుల కుటుంబంతో మాట్లాడిన చంద్రబాబు

    • సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు

    • పిల్లలను బాగా చదివించాలని చెప్పిన సీఎం చంద్రబాబు

    • తమకు ఇల్లు కావాలని సీఎంను కోరిన నాయక్‌ కుటుంబం

    • ఇల్లు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు హామీ

    Chandrababu-Hamee.jpg

  • 2024-07-01T07:03:37+05:30

    ప్రజావేదికలో చంద్రబాబు..

    • పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రజావేదికలో చంద్రబాబు

    • పెనుమాక మసీదు సెంటర్‌లో ప్రజావేదికలో భాగంగా..

    • లబ్ధిదారులు, ప్రజలతో సీఎం మాటామంతి

    Chandrababu-Praja.jpg

  • 2024-07-01T07:00:08+05:30

    రూ.75తో ప్రారంభం

    ఒకప్పుడు రూ.75తో ప్రారంభమైన సామాజిక పెన్షన్‌ ఇప్పుడు ఏకంగా రూ.4 వేలకు పెరిగింది. పెన్షన్‌ పెంపుపై ప్రతిసారీ టీడీపీ ప్రభుత్వమే చొరవ తీసుకుంది. మొదట్లో ఎన్టీఆర్‌ రూ.75తో పెన్షన్‌ ప్రారంభించారు. తర్వాత వైఎస్‌ హయాంలో రూ.200 చేశారు. 2014లో చంద్రబాబు ఐదు రెట్లు అంటే రూ.1000కు పెంచారు. 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు పెన్షన్‌ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచారు. వైసీపీ సర్కార్‌ వచ్చాక ఐదేళ్లలో విడతల వారీగా రూ.3 వేలు చేసింది. టీడీపీ కూటమి ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఏకంగా రూ.4 వేలు లభిస్తోంది.

    ntr-YSR-Jagan-Chandrababu-F.jpg

  • 2024-07-01T06:53:51+05:30

    పండుగ వాతావరణం

    మూడు నెలల బకాయితో కలిపి ఒకేసారి రూ.7 వేలు పెన్షన్‌ ఇస్తుండటంతో అవ్వాతాతలు సంబరపడుతున్నారు. పెన్షన్ల పంపిణీని పండుగలా నిర్వహించేలా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర రాజకీయ నేతలు ఈ పండుగను నిర్వహిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఐదు హామీలపై మొదటి ఐదు సంతకాలు చేసిన చంద్రబాబు వాటి అమలుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పెన్షన్లు పంపిణీకి శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో సచివాలయ ఉద్యోగులకు పెన్షన్ల పంపిణీ బాధ్యత అప్పగించకుండా అకౌంట్లలో జమచేసి పెన్షన్‌దారులను ఇబ్బందులు పెట్టారు. 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పటికీ అప్పట్లో అధికారులు అంగీకరించలేదు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పకడ్బందీగా పెన్షన్ల పంపిణీ చేపట్టవచ్చని నిరూపించేందుకు కూటమి సర్కార్‌ చర్యలు ప్రారంభించింది.

    Penisons.jpg

  • 2024-07-01T06:45:00+05:30

    ఎవరికెంత పెన్షన్!

    వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్లు వంటి వారికి ఇకపై ప్రతినెలా రూ.4 వేలు పెన్షన్‌ చంద్రబాబు సర్కార్ ఇవ్వనుంది. దివ్యాంగులకు రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచారు. తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు. ఈ విభాగంలో పెన్షన్‌ పొందే వారు 24,318 మంది ఉన్నారు. పింఛన్ల పెంపువల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్లు అదనపు భారం పడనుంది. ఒక్క రోజులో రూ.4408 కోట్లు పంపిణీ చేయనున్నారు. గడచిన మూడు నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,650 కోట్లు అదనపు భారం పడనుంది. గత ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి నెలకు రూ.1,939 కోట్లు ఖర్చయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఏటా పింఛన్ల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేయనుంది.

    Chandrababu-Pensions-Penuma.jpg

  • 2024-07-01T06:40:00+05:30

    తొలి పెన్షన్.. బాబు ఇచ్చారు!

    పెనుమాకలోని సుగాలికాలనీకి చెందిన బాణావత్‌ పాములు నాయక్‌ కుటుంబం చంద్రబాబు నుంచి తొలి పింఛన్‌ అందుకున్నది. పాములు నాయక్‌కు వృద్ధాప్య పింఛన్‌, ఆయన కుమార్తె ఇస్లావత్‌ శివకుమారికి వితంతు పింఛన్‌ను వారి ఇంటి వద్ద చంద్రబాబు స్వయంగా అందజేశారు. పింఛన్ల పంపిణీ అనంతరం సీఎం చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆయన పర్యటన నేపథ్యంలో పెనుమాక గ్రామం ముస్తాబయ్యింది.

    Chandrababu-01.jpg

  • 2024-07-01T06:36:00+05:30

    స్వయంగా సీబీఎన్ చేతులు మీదుగా!

    • తాడేపల్లి మండలం పెనుమాకలో పెంచిన పెన్షన్ పంపిణీ చేస్తున్న సీఎం

    • పెంచిన పెన్షన్ రూ.4వేలు సీఎం చేతులు మీదుగా ఇవ్వాలని నిర్ణయం

    • ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

    • పెనుమాక ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి..

    • నేరుగా పెన్షన్లు పంపిణీ చేస్తున్న చంద్రబాబు

    • ఉదయం 6:30 నుంచి 7:15 గంటల వరకు పెనుమాక మసీదు సెంటర్‌లో..

    • ప్రజావేదికలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో సీఎం మాటామంతి

    • ఒకేరోజు 65.18 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ

    • 65.18లక్షల మందికి పెన్షన్ల కింద రూ.4,408 కోట్లు పంపిణీ

    Chandrababu-Penisons2.jpg

  • 2024-07-01T06:30:00+05:30

    బాబు కదిలారు..!

    • పెనుమాకలో సీఎం చంద్రబాబు

    • సీఎం చంద్రబాబు వెంట మంత్రి లోకేష్‌

    • నేటినుంచి ఏపీలో పెంచిన పెన్షన్ల పంపిణీ

    Chandrababu-Penisons.jpg

  • 2024-07-01T06:05:00+05:30

    స్వయంగా సీబీఎన్..!

    అవును.. సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు..! పెన్షన్ల విషయంలో సీబీఎన్ ఇచ్చిన హామీ అక్షరాలా నిలబెట్టుకుని.. ఆయనే ఒక వలంటీర్‌గా మారారు..! గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. మొత్తం 1,20,097 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటిరోజే చాలావరకు పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.