Anand Mahindra: మానవాళికి ఎలాన్ మస్క్ ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్! ఆనంద్ మహీంద్రా ప్రశంస!
ABN , Publish Date - Sep 19 , 2024 | 08:05 PM
పుట్టుకతో చూపు లేని వారికి దృష్టి ప్రసాదించే బ్లైండ్ సైట్ ఇంప్లాంట్ పరికరాన్ని మస్క్ నేతృత్వంలోని న్యూరాలింక్ సిద్ధం చేస్తోంది. దీనికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ప్రాథమిక అనుమతి కూడా లభించడంతో ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా కూడా ఈ పరికరంపై ప్రశంసలు కురిపించారు.
ఇంటర్నెట్ డెస్క్: టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని న్యూరాలింక్ వైద్య పరికరాల రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. కదలలేని వారు చేతులు కాళ్లు అవసరం లేకుండానే పలు పరికరాలను నియంత్రించగలిగేలా మెదడులో అమర్చే కంప్యూటర్ చిప్ రూపొందించి సంచలనం సృష్టించిన సంస్థ.. తాజాగా మరో అద్భుతం ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. పుట్టుకతో చూపు లేని వారు, పలు కారణాలతో రెండు కళ్లూ, ఆప్టిక్ నర్వ్‌ను శాశ్వతంగా పోగొట్టుకున్న వారు సైతం చూడగలిగేలా ‘‘బ్లైండ్ సైట్’ ఇంప్లాంట్ పరికరాన్ని రూపొందించింది. ఈ పరికరానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ప్రాథమిక అనుమతి ఇచ్చిందని మస్క్ తాజాగా ప్రకటించారు. దీనిపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి (Viral).
Viral: విద్యార్థుల గొడవ.. టీచర్ పరిగెత్తుకుంటూ క్లాస్‌రూంలోకి వెళితే..
ఈ ఉదంతంపై తాజాగా ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. బ్లైండ్ సైట్ పరికరం విజయవంతమైతే మస్క్ మానవాళికి ఇచ్చిన అతి పెద్ద బహుమతి ఇదే అవుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. స్పేస్ ఎక్స్, టెస్లా కంటే ఇదే మానవాళిపై ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రభావం చూపుతుందని అన్నారు. దీంతో, బ్లైండ్ సైట్ పరికరంపై నెటిజన్లు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరికరాల సాంకేతికతలో ఇదో మైలురాయి కాబోతోందని వ్యాఖ్యానించారు (Anand Mahindras heartfelt message for Elon Musk on Blindsight device).
Russia: ఆఫీసుల్లో శృంగారంలో పాల్గొనండి.. రష్యా అధ్యక్షుడి కొత్త సూచన!
అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఈ పరికరాన్ని గుర్తించినా మనుషులపై ఎప్పటినుంచీ ప్రయోగాలు ప్రారంభమవుతాయో మస్క్ చెప్పలేదు. అయితే, ఈ పరికరం సామర్థ్యాలను మాత్రం లోతుగా వివరించారు. బ్లైండ్ సైట్ వినియోగించిన వారికి తొలుత చూపు కాస్తంత మసకగా అనిపించినా, కాలం గడిచేకొద్దీ చూపు అద్భుతంగా మారుతుందని, సహజసిద్ధమైన కంటి సామర్థ్యాన్ని మించిపోతుందని చెప్పారు. కేవలం సాధారణ కాంతి తరంగాలు మాత్రమే కాకుండా, అల్ట్రావయొలెట్, ఇన్‌ఫ్రారెడ్, రాడార్ తరంగాలను కూడా చూడగలుగుతారని చెప్పారు. అయితే, ఈ పరికరం ఉపయోగపడాలంటే చూపునకు కారణమయ్యే విజువల్ కార్టెక్స్ అనే మెదడు భాగం పనిచేస్తూ ఉండాలని అన్నారు.
Viral: బోను తాళాన్ని పళ్లతో విరగ్గొట్టిన పులి.. చూస్తే గూస్ బంప్స్ పక్కా!
మెదడులో అమర్చగలిగిన పలు కంప్యూటర్ చిప్స్‌ను రూపొందించేందుకు న్యూరాలింక్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. చేతులు కాళ్లు లేని వాళ్లు మెదడుతోనే పరికరాలను నియంత్రించేలా, చూపు లేని వారు చూడగలిగేలా ఈ చిప్స్‌ను సిద్ధం చేస్తూ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రయత్నిస్తోంది.
Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..