Share News

Viral: సోషల్ మీడియాలో జనాల సానుభూతితో డబ్బులు దండుకున్న వ్యక్తి జైలుపాలు

ABN , Publish Date - Dec 12 , 2024 | 11:18 PM

తనను భార్య వదిలిపెట్టేసిందని అన్నాడు. కూతురిని పెంచేందుకు అష్టకష్టాలు పడుతున్నానని చెప్పాడు. ఇలా సోషల్ మీడియాలో కట్టుకథలు అల్లి జనాల నుంచి డబ్బులు పుచ్చుకున్న చైనా వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

Viral: సోషల్ మీడియాలో జనాల సానుభూతితో డబ్బులు దండుకున్న వ్యక్తి జైలుపాలు

ఇంటర్నెట్ డెస్క్: తనను భార్య వదిలిపెట్టేసిందని అన్నాడు. కూతురిని పెంచేందుకు అష్టకష్టాలు పడుతున్నానని చెప్పాడు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నానని అన్నాడు. కూతురిని కూడా వెంట తీసుకెళతానని చెప్పాడు. ఇలా తనకు లేని కష్టాలన్నీ ఉన్నట్టు సోషల్ మీడియాలో జనాలను నమ్మించి డబ్బులు దండుకున్న ఓ చైనా వ్యక్తి ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. అతడిని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు (Viral).

స్థానిక మీడియా కథనాల ప్రకారం, నిందితుడు @qianyibaobei పేరిట ఉన్న అకౌంట్‌లో సానుభూతి కోసం అసత్యాలతో కూడిన వీడియోలు పోస్టు చేసేవాడు. తన పడుతున్న కష్టాలను మోసపూరిత వీడియోలు చేసి జనాలను సానుభూతి పొందేవాడు. వందకు పైగా సానుభూతి వీడియోలను తన అకౌంట్‌ద్వారా పంచుకున్నాడు. అతడి కష్టాలకు నెటిజన్లు కరిగిపోవడంతో ఫాలోవర్ల సంఖయ ఏకంగా 4 లక్షలు దాటింది.

Viral: రహదారిపై క్రాష్ ల్యాండింగ్.. రెండు ముక్కలైన విమానం!


ఈ క్రమంలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ భారీగా ఆర్జించాడు. రోజుకు 43 ఆర్డర్లను డెలివరీ చేస్తూ సగటున 40 డాలర్లు సంపాదిస్తుంటానంటూ భావోద్వేగాన్ని రక్తికట్టించేవాడు. చివరకు అతడి బండారం బయటపడటంతో అతడు ఆడుతున్న నాటకం బయటపడి జైలు పాలయ్యారు. అతడికి 10 రోజుల జైలు శిక్ష, 70 డాలర్ల జరిమానా పడే అవకాశం ఉందని తెలస్తోంది. నిందితుడు అసలు డెలివరీ బాయ్ కానేకాదని, భార్య అతడితోనే ఉంటోందని గుర్తించారు.

Viral: షాకింగ్ వీడియో! ఈ భారతీయ యువకుడు బంగ్లాదేశ్‌లో ఏం చేశాడో చూస్తే..


ఇటీవల వెలుగు చూసిన మరో ఉదంతంలో కూడా ఓ యువతి ఇలాగే జనాల సానుభూతిని సొమ్ము చేసుకుని చివరకు జైలు పాలైంది. తనకు తల్లిదండ్రులు లేరంటూ, తోబుట్టులను తానే పోషిస్తు్న్నానంటూ వీడియోలు చేసి జనాల నుంచి విరాళాల రూపంలో భారీగా డబ్బులు పుచ్చుకుంది. అయితే, వాస్తవానికి ఆమె తల్లిదండ్రులు బతికే ఉన్నారని, ఆమెకు విలాసవంతమైన జీవితం అలవాటని బయటపడటంతో జనాలు విస్తుపోయారు. ఇలా నిస్సిగ్గుగా మోసానికి పాల్పడినందుకు యువతికి 14 నెలల కారాగార శిక్ష, 14 వేల డాలర్ల జరిమానాను కోర్టు విధించింది.

Read Latest and Viral News

Updated Date - Dec 12 , 2024 | 11:18 PM