Share News

Viral: కెనడాలో రూ.1.2 కోట్ల శాలరీ! తమ సీక్రెట్ చెప్పేసిన ఎన్నారై దంపతులు!

ABN , Publish Date - Sep 24 , 2024 | 07:22 PM

కెనడాలో ఏకంగా రూ.1.2 కోట్లు సంపాదిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఎన్నారై జంట తాజాగా తమ సీక్రెట్ ఏంటో చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది

Viral: కెనడాలో రూ.1.2 కోట్ల శాలరీ! తమ సీక్రెట్ చెప్పేసిన ఎన్నారై దంపతులు!

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో ఏకంగా రూ.1.2 కోట్లు సంపాదిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఎన్నారై జంట తాజాగా తమ సీక్రెట్ ఏంటో చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది. వారి సూచనలు అనేక మంది మెప్పు పొందడంతో మంచి కెరీర్ మార్గదర్శకత్వం చేశారంటూ కామెంట్ చేస్తున్నారు.

కెరీర్‌లో ఎలా ఎదగాలనే అంశంపై కంటెంట్ అందించే ఇన్‌స్టాగ్రామ్‌ ఛానల్‌లో ఈ వీడియో దర్శనమిచ్చింది. వీడియోలోని ఇంటర్వ్యూవర్ కెనడాలో ఉంటున్న ఓ ఎన్నారై జంటను పలకరించాడు. వారు ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నారో? వారి జీతనాతాలు ఏంటో అడిగాడు.

Viral: దేవాలయం హుండీలో రూ.1.25 లక్షలు, ఓ ఉత్తరం! అందులో రాసున్నది చదివితే..


తాము ఇద్దరం ఐటీ రంగంలోనే ఉన్నామని ఆ జంట చెప్పింది. తనది ప్రోగ్రామింగ్ అని భర్త చెప్పగా తాను సపోర్టు రోల్‌లో ఉన్నట్టు భార్య తెలిపింది. ఇద్దరు ఏటా లక్ష కెనేడియన్ డాలర్ల చొప్పున సంపాదిస్తున్నట్టు తెలిపింది. ఇద్దరి సంపాదనా కలిపితే ఏటా రూ.1.2 కోట్లని తెలిపింది. దీంతో, ఇంటర్వ్యవర్‌ కూడా ఒకింత ఆశ్చర్యపోయారు (Indian Techie Couple Reveal Secret To 1 2 Crore Salary In Canada).

ఆ జంట సక్సెస్‌కు కారణమేంటో వివరించాలని కోరగా వారు తమ సీక్రెట్ చెప్పుకొచ్చారు. ఐటీ రంగంలో ముందుకెళ్లేందుకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం కీలకమని ఆ భర్త అభిప్రాయపడ్డాడు. హడూప్, క్లౌడ్, సీఎస్‌ఎమ్, పీఎంపీ వంటివాటితో మంచి శాలరీలు పొందొచ్చని అన్నాడు.

Viral: దంపతుల ఏళ్ల నాటి కల.. 17 కోట్లు పెట్టి భారీ ఎస్టేట్ కొంటే..

ఈ క్రమంలో ఇంటర్వ్యూవర్ మరో ప్రశ్న సంధించాడు. పీఎంపీ లాంటి సర్టిఫికేట్లు ప్రస్తుతం సులభంగానే లభిస్తున్నాయని కదా అని అన్నారు. ఈ సర్టిఫికేషన్‌కు మూడేళ్ల నాటి విలువ ఉందా అని సందేహం వ్యక్తం చేశాడు. అయితే, అలాంటి అనుమానాలు అవసరం లేదని ఎన్నారై వ్యక్తి అన్నాడు. ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌కు ఇప్పటికీ మార్కెట్‌లో విలువ ఉందని వివరించాడు.

Viral: 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసి షాక్!


అయితే, సర్టిఫికేషన్‌ విలువ టెకీలు పనిచేస్తున్న డొమైన్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. కొన్ని డొమైన్లలో క్లౌడ్ సర్టిఫికేషన్ చాలా ఉపయోగకరమని అన్నాడు. కొందరు సైబర్ సర్టిఫికేషన్‌తో లాభపడతారని అన్నాడు.

ఇక వీడియో చూసిన అనేక వ్యక్తులు వారి సంపాదనకు అబ్బుర పడ్డారు. చక్కని జీవితం ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్ చేశారు. కానీ కెనడాలో పన్నులకు సగం సంపాదన పోతుందని కొందరు చెప్పారు. అయినప్పటికీ వారి సంపాదనతో సుఖమయ జీవితం లభిస్తుందని చెప్పారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?

Legal Awareness: భారతీయ మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన టాప్ 5 చట్టాలు!

Viral: ఢిల్లీలో పర్యటిస్తూ భారత్‌పై బ్రిటీషర్ అవాకులు చవాకులు! వీడియో వైరల్

Read Latest and Viral News

Updated Date - Sep 24 , 2024 | 07:35 PM