Share News

Viral: భార్యకు స్కూటర్ యాక్సిడెంట్! తనపై తానే పోలీసు కేసు పెట్టుకున్న భర్త!

ABN , Publish Date - Sep 26 , 2024 | 04:07 PM

తన భార్య యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడటానికే తానే కారణమని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తనపై తానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఈ ఘటన వెలుగు చూసింది.

Viral: భార్యకు స్కూటర్ యాక్సిడెంట్! తనపై తానే పోలీసు కేసు పెట్టుకున్న భర్త!

ఇంటర్నెట్ డెస్క్: తన భార్య యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడటానికే తానే కారణమని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తనపై తానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా తెగ వైరల్ (Viral) అవుతోంది.

Viral: కెనడాలో రూ.1.2 కోట్ల శాలరీ! తమ సీక్రెట్ చెప్పేసిన ఎన్నారై దంపతులు!

స్థానిక మీడియా కథనాల ప్రకారం, రవి గౌర్ తన భార్య, పిల్లాడు, తన తమ్ముడితో కలిసి స్కూటర్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో అతడి భార్య కాలికి తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స అందించాల్సి వచ్చింది. భార్య దుస్థితి చూసి చలించిపోయిన రవి గౌర్ హుటాహుటిన పోలీస్ స్టేషన్ వెళ్లి తనపై తానే ఫిర్యాదు చేసుకున్నాడు.

Viral: ఒంటరితనంతో అవస్తపడుతున్న మహిళలకు టోకరా! రూ.3 కోట్లు దోచుకున్న వైనం


తన నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత తనదేనంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. తన భార్య వెనక సీటుపై పిల్లాడిని ఎత్తుకుని కూర్చోగా తాను డ్రైవ్ చేసినట్టు వివరించాడు. ఓ చోట ట్రాఫిక్ జామ్‌ కావడంతో అక్కడి ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మరోవైపు మళ్లించారని చెప్పాడు. అయితే, ఆలస్యం అవుతోందనే తొందరలో తాను వాహనాన్ని వేగంగా డ్రైవ్ చేశానని, ఫలితంగా స్కూటర్ రొడ్డుపై ఉన్న చిన్న గొయ్యిలో పడి భారీ కుదుపుకు లోనైందని తెలిపాడు. చివరకు బ్యాలెన్స్ తప్పి పక్కనే ఉన్న పెద్ద గొయ్యిలో పడిందన్నారు. ఈ క్రమంలో తన భార్యకు కాలికి గాయమై తీవ్ర రక్తస్రావమైందన్నారు.

Viral: దంపతుల ఏళ్ల నాటి కల.. 17 కోట్లు పెట్టి భారీ ఎస్టేట్ కొంటే..


కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో పోలీసులు ఆమె భర్తపై కేసు పెట్టారు. ఇక భార్యను ఆ తరువాత డిశ్చార్జ్ చేసినట్టు తెలిసింది. అయితే, భర్త తనపై తానే ఫిర్యాదు చేసుకున్న విధానం మాత్రం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశం అవుతోంది.

Viral: 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసి షాక్!

Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?

Legal Awareness: భారతీయ మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన టాప్ 5 చట్టాలు!

Viral: ఢిల్లీలో పర్యటిస్తూ భారత్‌పై బ్రిటీషర్ అవాకులు చవాకులు! వీడియో వైరల్

Read Latest and Viral News

Updated Date - Sep 26 , 2024 | 04:13 PM