Viral Video: చేతిపై పులిపురిని తీసేయకుండా.. గుర్తుండిపోయేలా ఎలా మార్చాడో చూస్తే.. .. ఆశ్చర్యపోవాల్సిందే..
ABN , Publish Date - Nov 26 , 2024 | 10:30 AM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన చేతిపై ఉన్న పులిపిరి తొలగించకుండా.. దాన్ని గుర్తుండిపోయేవిధంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇలా ఆలోచిస్తున్న క్రమంలో అతడికి వింత ఆలోచన వచ్చింది..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో మారుమూల ప్రాంతాల్లో ఏ చిన్న వినూత్న ఘటన చోటు చేసుకున్నా సరే.. ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది చిత్రవిచిత్రంగా ఆలోచిస్తూ వీడియోలు చేస్తుంటారు. కొందరు ఎవరూ ఆలోచించని విధంగా కొత్త కొత్తగా ఆలోచిస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబందించిన వీడియోలు నెట్టింట నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన చేతిపై ఉన్న పులిపురిని తొలగించకుండా వినూత్నంగా మార్చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన చేతిపై ఉన్న పులిపిరి (wart on the hand) తొలగించకుండా.. దాన్ని గుర్తుండిపోయేవిధంగా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇలా ఆలోచిస్తున్న క్రమంలో అతడికి వింత ఆలోచన వచ్చింది. పులిపురిని శివలింగం ఆకారంలో టాటూ (Shivalinga shaped tattoo) వేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు.
ఆలోచన వచ్చిందో తడవుగా ఆచరణలో పెట్టేశాడు. పులిపిరిపై నల్ల రంగు టాటూ వేయించి, దాని చుట్టూ శివలింగం ఆకారంలో ఆర్ట్ వేయించాడు. ఆ పక్కనే శివ అనే అక్షరాలను కూడా రాయించాడు. ఇలా తన చేతిపై ఉన్న పులిపిరి చివరకు శివలింగం తరహాలో మార్చేసి, శాశ్వతంగా గుర్తుండిపోయేలా మార్చేశాడు.
Viral Video: ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరూ చెప్పలేం.. అమ్మేది భేల్‌పూరీ అయినా..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘దేవుడిపై ఇతడికి ఉన్న భక్తికి హ్యాట్సాప్’’.. అంటూ కొందరు, ‘‘చేతిపై ఇలా దేవుడి గుర్తులు వేయించడం కరెక్ట్ కాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: ఫారెస్ట్ గార్డ్‌కు ఎదురుపడ్డ పులి.. చాకచక్యంగా దాన్నుంచి ఎలా తప్పించుకున్నాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..