Share News

Viral: మరీ ఇంత క్రూరత్వమా! కుక్క పిల్లను రైలు పట్టాలకు కట్టేసి..

ABN , Publish Date - Sep 20 , 2024 | 07:42 PM

కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ కుక్క పిల్లలను రైల్వే ట్రాక్‌కు కట్టేసి దానికి నరకం చూపించారు. అదృష్టవశాత్తూ అది మరో వ్యక్తి కంట పడటంతో అతడు దానిని కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Viral: మరీ ఇంత క్రూరత్వమా! కుక్క పిల్లను రైలు పట్టాలకు కట్టేసి..

ఇంటర్నెట్ డెస్క్: మానవత్వం పరిమళించే వ్యక్తులు కొందరైతే దానవత్వానికి ప్రతిరూపంగా నిలిస్తూ కరాళ నృత్యం చేసేవారు మరి కొందరు. ముఖ్యంగా ఈ రెండో కోవకు చెందిన వారు సృష్టించే బీభత్సం అంతా ఇంతా కాదు. ఇలాంటి కొందరు ఓ కుక్క పిల్లపై పైశాచికత్వం ప్రదర్శించిన వీడియో ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.

Viral: పెళ్లిళ్లు చెడగొట్టే యువకుడికి ఫుల్ డిమాండ్! కళ్లు చెదిరే సంపాదన!

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ కుక్క పిల్లతో దారుణంగా ప్రవర్తించారు. దాన్ని చిన్న వస్త్రంతో రైలు పట్టాలకు కట్టేసి వదిలేశారు. అంగుళం కూడా కదల్లేనంతగా దాన్ని గట్టిగా పట్టాలకు కట్టేసి పైశాచికానందం పొందారు. ఏం జరుగుతోందో అర్థం కాక ఆ కుక్క పిల్ల చావు కోసం ఎదురు చూడసాగింది.

Viral: చెత్త ఏరుకునే యువకుడి సంపాదన నెలకు రూ.1.5 లక్షలు.. షాక్‌లో జనాలు!


ఇంతలో ఏ దేవుడో కరుణించడంతో ఓ మానవతా మూర్తి దృష్టి దానిపై పడింది. దాని అరుపులు విన్న ఓ వ్యక్తి వచ్చి కుక్క పిల్ల కట్లు విప్పి విముక్తి కల్పించాడు. పట్టాలపై నుంచి దాన్ని పక్కకు తీసుకొచ్చి కాపాడాడు. అది ఆకలితో ఉందని గుర్తించి ఆహారాన్ని కూడా ఇచ్చాడు. మనిషి అంటేనే వణికిపోయే స్థితికి చేరుకున్న ఆ కుక్క పిల్ల.. ఆహారం తిన్నాక తన వేదన అంతా మర్చిపోయింది. ఆహారం పెట్టిన వ్యక్తి అంటే ఇష్టత ప్రదర్శిస్తూ తోక ఊపడం ప్రారంభించింది.

TamilNadu: మహిళా కస్టమర్ తిట్లు.. డెలివరీ ఏజెంట్ ఆత్మహత్య!


వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్ల మనసు కరిగిపోయింది. మనిషి కర్కశత్వాన్ని చవి చూశాక కూడా ఆ కుక్క పిల్ల మళ్లి మరో మనిషిని నమ్మడం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి నిష్కల్మషమైన జీవిని ఎలా హింసించ గలిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కుక్క పిల్లను కాపాడిన వ్యక్తిపై కూడా ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వాళ్లను చూస్తుంటే మానవత్వంపై పోయిన నమ్మకం తిరిగొస్తోందని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ గా మారింది.

Read Latest and Viral News

Updated Date - Sep 20 , 2024 | 07:45 PM