Share News

Shaktimaan: వావ్.. శక్తిమాన్ మళ్లీ వచ్చేస్తున్నాడోచ్.. వివరాలివే..

ABN , Publish Date - Nov 10 , 2024 | 09:13 PM

Shaktimaan: ‘శక్తిమాన్’.. 1990-2000 నాటి పిల్లలకు ఒక ఎమోషన్. అదివారం వచ్చిందంటే చాలు టీవీల ముందు వాలిపోయేవాళ్లు పిల్లలు. సరిగ్గా 12 గంటలకు డీడీ నేషనల్‌లో ‘శక్తిమాన్.. శక్తిమాన్..’ అంటూ పాట రావడంతో పిల్లలు ఏదో తెలియని..

Shaktimaan: వావ్.. శక్తిమాన్ మళ్లీ వచ్చేస్తున్నాడోచ్.. వివరాలివే..
shaktimaan

Shaktimaan: ‘శక్తిమాన్’.. 1990-2000 నాటి పిల్లలకు ఒక ఎమోషన్. అదివారం వచ్చిందంటే చాలు టీవీల ముందు వాలిపోయేవాళ్లు పిల్లలు. సరిగ్గా 12 గంటలకు డీడీ నేషనల్‌లో ‘శక్తిమాన్.. శక్తిమాన్..’ అంటూ పాట రావడంతో పిల్లలు ఏదో తెలియని ఉత్సాహంతో ఊగిపోయేవారు. సీరియల్ కంప్లీట్ అయ్యేంత వరకు టీవీకి అతుక్కుపోయేవారు. ఆ తరువాత.. తామే శక్తిమాన్‌లా మారిపోయి సాహసాలు చేస్తుండేవారు. అంతగా పాపులర్ అయ్యింది శక్తిమాన్ సీరియల్. కొన్ని కారణాల వల్ల ఈ సీరియల్‌ను నిలిపివేసినా.. ఆ సీరియల్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ శక్తిమాన్ సీరియల్‌ను ప్రసారం చేయాలనే డిమాండ్స్ వినిపిస్తుంటాయి. కరోనా సమయంలో దూరదర్శన్ చానెల్‌లో రామాయణం, మహాభారతం ప్రసారం చేసినట్లుగానే.. శక్తిమాన్ సీరియల్‌ను కూడా ప్రసారం చేశారు.


ఇక 2011లో ఈ సీరియల్‌ యానిమేషన్ రూపంలో వచ్చింది. 2013లో సినిమా రూపంలో విడుదల చేశారు. ఇప్పుడు శక్తిమాన్ సీక్వెల్‌ను ప్రసారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. యూట్యూబ్‌లో శక్తిమాన్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ షో గురించిన వివరాలు కూడా ముఖేష్ ఖన్నా పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రకారం.. ‘శక్తిమాన్’ పాత్రలో మళ్లీ ముఖేష్ ఖన్నానే నటించనున్నట్లు తెలుస్తోంది.


19 ఏళ్ల తరువాత మళ్లీ..

1997 నుంచి 2005 మధ్య శక్తిమాన్ సీరియల్‌ను దూరదర్శన్‌లో ప్రసారం చేశారు. ఈ సీరియల్‌ దాదాపు 19 ఏళ్ల తరువాత మళ్లీ వస్తోంది. దీంతో ఈ సీరియల్ సీక్వెన్స్‌పై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ముఖేష్ ఖన్నా వయసు 66. ఈ వయసులోనూ ఆయన శక్తిమాన్‌లా అలరించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు.. అభిమానుల అంచనాల నేపథ్యంలో మేకర్స్ ఈ సీరియస్ చిత్రీకరణ ఒక సవాలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. శక్తిమాన్ సీరియల్ అనేది చాలా మందికి ఒక ఎమోషన్. చాలా మందికి తమ బాల్యాన్ని గుర్తు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే.. ఈ సీరియల్‌పై అందరిలోనే ఇంట్రస్ట్ పెరిగిపోతుంది. పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేస్తూ.. కొత్త స్టైల్‌లో ‘శక్తిమాన్’ను ప్రజల ముందుకు ఎలా తీసుకువస్తారు.. ప్రజలను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

దేశంలోనే మొదటి సూపర్ హీరో..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ముఖేష్ ఖన్నా.. శక్తిమాన్ త్వరలో రాబోతున్నట్లు ప్రకటించారు. తిరిగి రావడానికి ఇదే సరైన సమయం అని కూడా పేర్కొన్నారు. భీష్మ ఇంటర్నేషనల్ యూట్యూబ్‌లో టీజర్ విడుదల చేశారు. ఆ వీడియోలో ‘భారతదేశపు మొదటి సూపర్ టీచర్, సూపర్ హీరో. అవును, ఈ రోజుల్లో పిల్లలను చీకటి ఆవహించింది. అందుకే ఆ చీకట్లను తొలగించడానికి ఇదే సరైన సమయం. కొత్త సందేశంతో తిరిగి వస్తుంది’ అంటూ టీజర్‌లో చెప్పారు.


శక్తిమాన్ ఎక్కడ ప్రసారమవుతుంది..

‘శక్తిమాన్’ టీజర్ రివీల్ అయింది. ముఖేష్ ఖన్నా దీనిని తన యూట్యూబ్ ఛానెల్ భీష్మా ఇంటర్నేషనల్‌లో విడుదల చేశారు. కొన్ని పాత క్లిప్‌లతో పాటు.. ఒక డైలాగ్ కూడా ఉంది. ‘భీష్మా ఇంటర్నేషనల్’ మళ్లీ ‘శక్తిమాన్’ని తీసుకువస్తున్నట్లు టీజర్‌లో చెప్పారు. అయితే, ఈ సీరియల్ టీవీలో వస్తుందా? లేక ఓటీటీలో వస్తుందా? లేక యూట్యూబ్‌లో విడుదల చేస్తారా? అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.


Also Read:

చివరి స్వింగ్ రాష్ట్రంలోనూ ట్రంప్ విజయం!

ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. ఆ ఐఏఎస్‌లు బదిలీ..

ఈ అంకుల్ ప్రేమ మామూలుగా లేదుగా..

For More Trending News and Telugu News..

Updated Date - Nov 10 , 2024 | 09:13 PM