Share News

Viral: ఢిల్లీలో పర్యటిస్తూ భారత్‌పై బ్రిటీషర్ అవాకులు చవాకులు! వీడియో వైరల్

ABN , Publish Date - Sep 21 , 2024 | 03:41 PM

భారత్‌ను ఓ విఫలదేశంగా చూపించే కుటిల వ్యూహానికి తెరతీసిన ఓ బ్రిటన్ వ్లాగర్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ నెటిజన్లు అతడిని ఎండగడుతున్నారు.

Viral: ఢిల్లీలో పర్యటిస్తూ భారత్‌పై బ్రిటీషర్ అవాకులు చవాకులు! వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: విదేశీయుల్లో అనేక మందికి భారత దేశ సంస్కృతి సంప్రదాయాలంటే అపారమైన గౌరవం. ఈ దేశం పట్ల ఇష్టతతో అనేక మంది తమ మాతృదేశాన్ని కాదనుకుని ఇక్కడే సెటిలైపోయారు. కానీ కొందరికి మాత్రం మన దేశం అంటే హేళన. భారత్‌లో కాస్తంత ఇబ్బందికర ప్రాంతాలను తమ వీడియోల్లో కావాలనే హైలైట్ చేస్తూ అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం చేస్తారు. భారతీయుల అతిథి మర్యాదల గురించి పొగుడుతూనే భారత దేశాన్ని హేళన చేసే దుస్సాహసానికి పూనుకుంటారు . నోటితో మాట్లాడుతూనే నోసటితో వెక్కిరిస్తుంటారు. ఇదే కుతంత్రాన్ని ప్రయోగించిన ఓ బ్రిటీష్ వ్లాగర్‌ను ప్రస్తుతం భారతీయ నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు (Viral).

Viral: వేట అంటే ఇదీ..ఈ పక్షి టాలెంట్ పీక్స్! చూసి తీరాల్సిన వీడియో!


బెంజమిన్ రిచ్ అనే యూట్యూబర్ ఈ వీడియో పోస్టు చేశాడు. ఆరేళ్ల క్రితం భారత్ సందర్శించిన అతడు తాజాగా మరోసారి భారత్‌లో పర్యటించాడు. కోల్‌కతా, ఢిల్లీలో పర్యటించాక ఈ వీడియో పోస్టు చేశాడు. ఢిల్లీలోని పహాడ్‌గంజ్ వరకూ రిక్షాలో వెళ్లిన అతడు ఆరేళ్ల తరువాత కూడా ట్రాఫిక్ పరిస్థితి ఏమీ మారలేదన్నాడు. ‘‘ఈ ఆరేళ్లల్లో పరిస్థితి కొంతైనా మారి ఉండాల్సింది. కానీ ఈ ట్రాఫిక్ రద్దీని చూస్తుంటే అలాంటిది ఏమీ లేదని పిస్తోంది’’ అని కామెంట్ చేశాడు (Travel vlogger on YouTube calls India most frustrating place to travel).

Viral: మరీ ఇంత క్రూరత్వమా! కుక్క పిల్లను రైలు పట్టాలకు కట్టేసి..

రోడ్లపై గొయ్యలు, నీరు నిలవడం, నిత్యం హారన్‌లు మోగించే వాహనాల తీరుపై విమర్శలు గుప్పించిన అతడు.. అత్యంత చిరాకు పుట్టించే పర్యాటక ప్రాంతం భారత్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటనల అనుభవం బాగా ఉన్న ప్రొఫెషనల్ పర్యాటకులు మాత్రమే ఇక్కడకు రావాలని సూచించాడు. పర్యటనల అనుభవం పెద్దగా లేనివారు ఇక్కడకు రావద్దన్నాడు. ఇలా భారత్‌లోని పరిస్థితులను అవహేళన చేస్తూనే భారతీయులను మాత్రం పొడుగుతూ తన అతి తెలివిని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. కానీ జనాలకు మాత్రం అతడి దురుద్దేశం అర్థం కావడంతో చెడుగుడు ఆడుకుంటున్నారు.

Viral: అత్తమామల కోసం రైల్ టిక్కెట్లు బుక్ చేసిన మహిళకు షాక్!


బెంజిమిన్ వీడియోపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు కురుస్తున్నాయి. దురుద్దేశంతోనే ఇలాంటి వీడియోలు చేస్తున్నాడంటూ భారతీయ నెటిజన్లు మండిపడ్డారు. ‘‘భారత్‌లోని ఇబ్బందికర అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ భారత వ్యతిరేకుల వ్యూస్ కోసం పాకులాడుతున్నాడేమో?’’ అని ఓ వ్యక్తి అనుమానం వ్యక్తం చేశాడు. ఇప్పటికే భారత్‌పైవిదేశీయుల్లో ఉన్న తప్పుడు అభిప్రాయాల్ని బలపరిచేలా వీడియోలు చేస్తూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ‘‘ఇది భారత్‌ను విఫలమైన దేశంగా చిత్రీకరించే కుటిల వ్యూహం. ఇది సబబు కాదు. గతంలో ఇలా చేసేవాడు కాదు’’ అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య అతడి వీడియో హాట్ టాపిక్‌గా మారింది.

Read Latest and Viral News

Updated Date - Sep 21 , 2024 | 04:21 PM