Share News

Viral News: భర్త కీచకపర్వం.. భార్య ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా..

ABN , Publish Date - May 23 , 2024 | 03:08 PM

మగాళ్లలో కొందరు మృగాళ్లు ఉంటారు. వావివరసలు చూడకుండా మహిళలపై కీచకపర్వానికి పాల్పడుతుంటారు. ఎలాగైనా మహిళల్ని లొంగదీసుకొని, తమ కామవాంఛ తీర్చుకోవాలని చూస్తుంటారు.

Viral News: భర్త కీచకపర్వం.. భార్య ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా..

మగాళ్లలో కొందరు మృగాళ్లు ఉంటారు. వావివరసలు చూడకుండా మహిళలపై కీచకపర్వానికి పాల్పడుతుంటారు. ఎలాగైనా మహిళల్ని లొంగదీసుకొని, తమ కామవాంఛ తీర్చుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు ఓ వ్యక్తి సైతం అలాంటి పైశాచికత్వానికే పాల్పడ్డాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సహకారంతో.. మహిళల్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడు. చివరికి.. తన భార్య స్నేహితులని సైతం విడిచిపెట్టలేదు. ఫైనల్‌గా ఓ మహిళ ధైర్యం చేసి ముందుకు రావడంతో.. ఆ కీచకుడి పాపం పండింది.

Read Also: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్ ప్రకటించాడా.. అసలు నిజం ఏంటి?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh) చెందిన యశ్ భావ్‌సర్ (Yash Bhavsar) అనే వ్యక్తి షాజాపూర్ మున్సిపల్ కౌన్సిల్‌లో ఒక కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అతనికి పెళ్లి కూడా అయ్యింది. అయితే.. భార్య దగ్గర ఎంతో బుద్ధిమంతుడిలా ప్రవర్తించే అతనిలో ఓ రాక్షసుడు ఉన్నాడు. డీప్‌ఫేక్ చిత్రాలను రూపొందించి.. తనతో మాట్లాడాలంటూ మహిళలు, బాలికల్ని బ్లాక్‌మెయిల్ చేశాడు. కాలేజీలో చదివే అమ్మాయిలనే అతను ఎక్కువగా టార్గెట్ చేసేవాడు. ఎవరైనా తనతో మాట్లాడేందుకు నిరాకరిస్తే.. వాళ్ల డీఫ్‌ఫేక్ ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడు.


Read Also: విమానంలో విచిత్రం.. సీటు లేకపోవడంతో ఏం జరిగిందంటే?

మొదట్లో నకిలీ ఖాతాల ద్వారా యశ్ సోషల్ మీడియాలో (Social Media) అమ్మాయిలు, మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. ఆపై ఏఐ టెక్నాలజీతో వారి డీప్‌ఫేక్ (Deepfake Photos) ఫోటోలు పంపించి.. తనతో అసభ్యకరంగా మాట్లాడమని వేధించేవాడు. ఎవరైనా నిరాకరిస్తే.. వెంటనే ఆ ఫోటోలు వైరల్ చేసి, కుటుంబ పరువు బజారుకీడుస్తానని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. పాపం.. తమ పరువు ఎక్కడ పోతుందోనని, చాలామంది అమ్మాయిలు అతడు చెప్పినట్లే చేశారు. అయితే.. ఓ మహిళ మాత్రం అతనికి లొంగలేదు. తనపై డీప్‌ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసినందుకు, అతనికి తగిన బుద్ధి చెప్పింది.

Read Also: ఆర్సీబీని విరాట్ కోహ్లీ వీడాలి.. అప్పుడే అది సాధ్యమవుతుంది

యశ్‌పై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీప్‌ఫేక్ ఫోటోలతో బెదిరించేందుకు ప్రయత్నించాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. యశ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడే మరిన్ని షాకింగ్ నిజాలు బయటకొచ్చాయి. ఆ కీచకుడు తన భార్య స్నేహితులపై కూడా డీప్‌ఫేక్ ఫోటోలు సృష్టించాడని, చివరికి తన భార్యని సైతం వదిలిపెట్టలేదని పోలీసులు విచారణలో తేల్చారు. అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళల్ని సూచించారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - May 23 , 2024 | 03:14 PM