Share News

Viral: అత్తమామల కోసం రైల్ టిక్కెట్లు బుక్ చేసిన మహిళకు షాక్!

ABN , Publish Date - Sep 20 , 2024 | 06:55 PM

అత్తమామలకు రైల్వే టిక్కెట్లు బుక్ చేసిన ఓ మహిళకు తాజాగా భారీ షాక్ తగిలింది. వృద్ధులు ఇద్దరికీ పైబెర్తులు రావడంతో దిమ్మెరపోయి ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకుంది.

Viral: అత్తమామల కోసం రైల్ టిక్కెట్లు బుక్ చేసిన మహిళకు షాక్!

ఇంటర్నెట్ డెస్క్: అత్తమామలకు రైల్వే టిక్కెట్లు బుక్ చేసిన ఓ మహిళకు తాజాగా భారీ షాక్ తగిలింది. వృద్ధులు ఇద్దరికీ పైబెర్తులు రావడంతో దిమ్మెరపోయిన ఆమె ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకుంది. ఇది ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.

Viral: పెళ్లిళ్లు చెడగొట్టే యువకుడికి ఫుల్ డిమాండ్! కళ్లు చెదిరే సంపాదన!


నిధీ శ్రీ అనే మహిళ తన అత్తమామలు, ఆడ పడుచు కోసం ఇటీవల రైల్వే టిక్కెట్లు బుక్ చేసింది. ఆమె మామ వయసు 61 ఏళ్లు కాగా, అత్తకు 54 ఏళ్లు. ఆడపడుచుకు 24 ఏళ్లు. అయితే, ఏకంగా 200 సీట్లు ఖాళీగా ఉన్న రైల్లో అత్తమామలిద్దరికీ పైబెర్తులు బుక్ కావడంపై ఆమె షాకైపోయింది. ‘‘నేను ఒక సైడ్ లోవర్ బెర్తు, రెండు లోవర్ బెర్తులను ఎంపిక చేశాను. కానీ ఇందుకు విరుద్ధంగా రెండు అప్పర్ బెర్తులు, ఒక మిడిల్ బెర్తు ఇచ్చారు’’ అని ఆమె చెప్పింది. దీనిపై ఫిర్యాదు చేయగా సీట్లు ఖాళీలేవని ఐఆర్‌సీటీసీ చెప్పిందని ఆమె సోషల్ మీడియాలో పేర్కొంది. కానీ, రైల్లో ఏకంగా 200 సీట్లు ఖాళీ ఉన్నట్టు కనిపిస్తుంటే ఇదెలా సాధ్యమని ఆమె సోషల్ మీడియాలో ప్రశ్నించింది. ఐఆర్‌సీటీసీతో పాటు రైల్వే మంత్రిని కూడా తన పోస్టుకు ట్యాగ్ చేసింది (woman claims irctc allots upper berths to senior citizens).

Viral: చెత్త ఏరుకునే యువకుడి సంపాదన నెలకు రూ.1.5 లక్షలు.. షాక్‌లో జనాలు!


కాగా, ఈ ఘటనపై రైల్ సేవ ట్విట్టర్ వేదికగా స్పందించింది. రైల్వేలో కంప్యూటర్ ఆధారిత రిజర్వేషన్ వ్యవస్థ అమల్లో ఉందని పేర్కొంది. దీని ద్వారా వృద్ధులకు కింది బెర్తులు ఇచ్చే సౌలభ్యం ఉందని వివరించింది. 45 ఏళ్లు పైబడిన మహిళలకు, గర్భవతులకు కూడా కింది బెర్తులే అందుతాయని చెప్పింది. అయితే, కింది బెర్తులు అందుబాటులో ఉన్నప్పుడే ఇదంతా సాధ్యమని వెల్లడించింది. అంతేకాకుండా, అవకాశం ఉంటే రైల్లో టిక్కెట్ చెకింగ్ సిబ్బంది వృద్ధులకు కింది బెర్తులు కేటాయిస్తారని తెలిపింది. కాబట్టి, రైల్లో కింది బెర్తులు లేకపోవడంతో పైబెర్తులు వచ్చి ఉండచ్చని పేర్కొంది. ఇక ఈ ఉదంతంపై నెటిజన్లు కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Read Latest and Viral News

Updated Date - Sep 20 , 2024 | 07:01 PM