Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే కోటీశ్వరుడైన వైభవ్ విధ్వంసం.. 76 పరుగులతో అజేయంగా..
ABN , Publish Date - Dec 05 , 2024 | 08:05 AM
అండర్ 19 ఆసియా కప్ 2024లో భారత జట్టు ఆకట్టుకునే ప్రదర్శన కొనసాగుతోంది. బుధార్‌లో యూఏఈని 10 వికెట్ల తేడాతో భారత్ జట్టు ఓడించి టోర్నీలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయంలో 13 ఏళ్ల యువ స్టార్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఇన్నింగ్స్ అడాడు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం గత వారం నిర్వహించిన మెగా వేలంలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) చర్చల్లో నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ. 1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత చిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. తాజాగా ఇదే ఆటగాడు అండర్-19 ఆసియా కప్(Asia Cup 2024)లో భారత్ (team india) తరఫున మ్యాచ్ విన్నింగ్ ఫిఫ్టీని సాధించి మరో సారి హాట్ టాపిక్‌గా నిలిచాడు.
76 పరుగులతో చెలరేగి
అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన గ్రూప్ ఏలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)పై భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఆ క్రమంలో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు మొత్తం 44 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. వైభవ్ సూర్యవంశీ (46 బంతుల్లో 76 నాటౌట్), ఆయుష్ మ్హత్రే (67 నాటౌట్) తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం చేశారు. దీంతో భారత్ 16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 143 పరుగులు చేసి సులభమైన విజయాన్ని నమోదు చేసింది.
ధోని స్టైల్‌లో సిక్సర్లు
ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. అతను 165.21 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో వేగంగా పరుగులు సాధించాడు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ గతంలో పాకిస్థాన్‌పై తొమ్మిది బంతుల్లో ఒక పరుగు, నేపాల్‌పై 23 బంతుల్లో 23 పరుగులు సాధించగా, ఆయుష్ మ్హత్రే నాలుగు సిక్సర్లు, పలు ఫోర్లు కొట్టాడు. చివరకు విజయవంతమైన సిక్సర్ కొట్టి ధోని స్టైల్‌లో వైభవ్ భారత్ మ్యాచ్‌ను ముగించాడు.
సెమీఫైనల్‌కు భారత్
రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యుధ్జిత్ గుహా 15 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. చేతన్ శర్మ (27 పరుగులకు రెండు వికెట్లు), ఆల్ రౌండర్ హార్దిక్ రాజ్ (28 పరుగులకు రెండు వికెట్లు) చెరో రెండు వికెట్లు తీశారు. గ్రూప్ ఓపెనర్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 43 పరుగుల నిరాశాజనక ఓటమితో టోర్నమెంట్‌లో భారత్ తమ ప్రచారాన్ని ప్రారంభించింది. తర్వాత జపాన్ జట్టును 211 పరుగుల తేడాతో ఓడించింది. గ్రూప్-బిలో అగ్రస్థానంలో ఉన్న శ్రీలంకతో భారత్ సెమీఫైనల్స్‌లో తలపడగా, గ్రూప్ ఏలో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో పాకిస్థాన్, శ్రీలంక జట్లు అజేయంగా నిలిచాయి.
ఇవి కూడా చదవండి:
Maharashtra CM Oath 2024: నేడే మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం.. హోం శాఖ వీరికేనా..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Read More Sports News and Latest Telugu News