Rohit Sharma: ముంబై టీమ్‌లో రెండు వర్గాలు.. భారత ఆటగాళ్లు రోహిత్ వైపు.. ఫారిన్ ప్లేయర్లు హార్దిక్ వైపు..?
ABN , Publish Date - May 16 , 2024 | 11:44 AM
రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ టీమ్ అనవసర వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది. హార్దిక్‌ను కెప్టెన్ చేయడాన్ని చాలా మంది ముంబై ఫ్యాన్స్ వ్యతిరేకించారు. అన్ని విమర్శల నడుమ ముంబై టీమ్ నాయకత్వం చేపట్టిన హార్దిక్ ఘోరంగా విఫలమయ్యాడు.
రోహిత్ శర్మను (Rohit Sharma) తప్పించి హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) కెప్టెన్ చేసినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ (MI) టీమ్ అనవసర వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది. హార్దిక్‌ను కెప్టెన్ చేయడాన్ని చాలా మంది ముంబై ఫ్యాన్స్ వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. అన్ని విమర్శల నడుమ ముంబై టీమ్ నాయకత్వం చేపట్టిన హార్దిక్ ఘోరంగా విఫలమయ్యాడు. ప్రస్తుత ఐపీఎల్ (IPL 2024)లో ముంబై టీమ్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 13 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి ప్లే-ఆఫ్స్ (IPL 2024 Playoffs) రేసు నుంచి వైదొలగింది.
ముంబై టీమ్ ఆటగాళ్ల మధ్య విభేదాలున్నాయని తాజాగా ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. ఆటగాళ్లు రెండు వర్గాలుగా విడిపోయారని తెలుస్తోంది. జట్టులోని స్వదేశీ ఆటగాళ్లు రోహిత్ శర్మ వైపు, విదేశీ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా వైపు ఉన్నారని సమాచారం. నిజానికి ముంబై టీమ్‌లో స్వదేశీ ఆటగాళ్లదే కీలక పాత్ర. రోహిత్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు ఒక వర్గంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌లో కూడా ఈ రెండు వర్గాల ఆటగాళ్లు వేర్వేరుగా ప్రాక్టీస్ చేస్తున్నారట.
ఈ సీజన్‌లో రోహిత్ శర్మ, హార్దిక్‌లు ఇద్దరూ వ్యక్తిగతంగా మంచి ప్రదర్శనలు చేయలేదు. మొదట్లో బాగా ఆడిన రోహిత్ ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు. ఇక, వ్యక్తిగత ప్రదర్శన దృష్ట్యా హార్దిక్ కెరీర్లోనే ఇది చెత్త ఐపీఎల్‌గా నిలిచింది. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో హార్దిక్ పూర్తిగా నిరాశపరిచాడు. వచ్చే ఏడాది మెగా వేలం ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ముంబై టీమ్‌లో సమూల మార్పులు చోటు చేసుకుంటాయని వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
Hyderabad: జోరుగా.. హుషారుగా.. ఉప్పల్ స్టేడియంలో ఆటగాళ్ల ప్రాక్టీసు
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..