Share News

India vs England: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ABN , Publish Date - Jun 27 , 2024 | 09:01 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ పోరు ప్రారంభమైంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న...

India vs England: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
India vs England

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ పోరు ప్రారంభమైంది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టు రంగంలోకి దిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడటంతో.. పరిస్థితులు బౌలింగ్‌కి అనుకూలంగా ఉంటాయన్న ఉద్దేశంతో బౌలింగ్ ఎంపిక చేశామని ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ తెలిపాడు. అయితే.. తాను గనుక టాస్ గెలిచి ఉంటే, పరిస్థితులకు అనుగుణంగా తప్పకుండా బ్యాటింగ్ ఎంపిక చేసుకునేవాడినంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఝలకిచ్చాడు.


ఇదిలావుండగా.. ఈ మ్యాచ్‌లో గెలుపొంది, 2022 నాటి సెమీ ఫైనల్ పరాభావానికి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. అఫ్‌కోర్స్.. ఆ ఓటమి భయం వెంటాడుతున్న విషయం వాస్తవమే గానీ, దానికి ధీటుగా బదులివ్వాలన్న కసి కూడా భారత జట్టు ఆటగాళ్లలో కనిపిస్తోంది. దీనికితోడు.. గతంలో మాదిరిగా పరిస్థితులు లేవు కాబట్టి, భారత జట్టు తప్పకుండా గెలుస్తుందన్న నమ్మకాలు నెలకొన్నాయి. అటు.. సూపర్-8లో ఉన్నప్పుడు దాదాపు నిష్ర్కమణ స్టేజ్ నుంచి పుంజుకొని సెమీస్‌కి చేరిన ఇంగ్లండ్ జట్టు, ఈ సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తోందని చూస్తోంది. ఓవరాల్‌గా చూస్తే.. బలాబలాల పరంగా రెండు జట్లు సమం కాబట్టి, ఇందులో ఎవరు గెలుస్తారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - Jun 27 , 2024 | 09:01 PM